09-12-2024 12:28:56 AM
నాగర్‌కర్నూల్, డిసెంబర్ 8 (విజయక్రాంతి): నాగర్‌కర్నూల్‌లోని నాగ నూలు నాగనూలు కస్తూర్బా గాంధీ పాఠశాలలో కల్తీ ఆహారం కారణంగా ఆదివారం రాత్రి ముగ్గురు విద్యార్థిను లు అస్వస్థతకు గురయ్యారు. ఎస్వో శోభారాణి తెలిపిన వివరాల ప్రకా రం.. ఆదివారం విద్యార్థులకు తల్లిదండ్రులతో కలిసే వెసులుబాటు కల్పిం చారు. అయితే అప్పటికే ఆరోగ్యసమస్యతో బాధపడుతున్న ఇంటర్ ద్వితీ య సంవత్సరం చదువుతున్న అక్ష య, ప్రేమలత వారి తల్లి తీసుకొచ్చిన చపాతి, చికెన్ తిన్నారు.
అనంతరం రాత్రి వీరితో పాటు మరో విద్యార్థిని కూడా తీవ్ర కడుపునొప్పితో ఇబ్బంది పడుతుండగా జిల్లా ఆసుపత్రికి తరలించి చికిత్స అందించారు. ప్రస్తుతం వారి పరిస్థితి నిలకడగానే ఉందని వైద్యులు తెలిపారు. విద్యార్థుల తల్లిదండ్రులు మాత్రం పాఠశాలలోనే ఫుడ్‌పాయిజన్ జరిగి ఉంటుందని ఆరోపిస్తున్నారు.