23 June, 2026 | 7:49 PM

Breaking News

పాఠ్యపుస్తకాల పేరిట దోపిడీని అరికట్టాలి: ఏఐవైఎఫ్ హెచ్చరిక   •   నెల రోజులు ఇంటింటి సర్వే...   •   రైతుల ఖాతాల్లో ధాన్యం డబ్బులు వెంటనే జమ చేయాలి   •   కల్లూరు ప్రభుత్వ జూనియర్ కళాశాలలో మత్తు పదార్థాల వ్యతిరేక అవగాహన కార్యక్రమం   •   ఫాదర్ అమల్ ఫ్రాన్సిస్ ఆధ్వర్యంలో ఘనంగా అంతర్జాతీయ యోగా దినోత్సవం   •   మూతపడిన ప్రభుత్వ పాఠశాల ప్రారంభానికి ముహూర్తం ఖరారు   •   విబిజీ రాంజీ విధానాన్ని రద్దుచేసి 'ఎన్ఆర్ఈజీఎస్'ను పునరుద్ధరించాలి   •   చంద్‌నగర్ ప్రాథమిక పాఠశాలకు ఆర్వో ప్లాంట్ అందజేసిన సర్పంచ్ సింగం శ్రీహరి   •   పదవ తరగతిలో ఉత్తీర్ణులైన విద్యార్థులకు సన్మానం   •   వ్యవసాయంలో ఆధునిక పద్ధతులు, పంట మార్పిడి, విత్తన ఎంపికతో అధిక దిగుబడులు   •  

బాన్సువాడ బల్దియా చైర్ పర్సన్‌గా కాసుల విజయ బాలరాజ్ ఏకగ్రీవ ఎన్నిక...

17-02-2026 01:18 AM
  1. వైస్ చైర్ పర్సన్‌గా రేష్మా బేగం ఏజాజ్ ఏకగ్రీవంగా ఎన్నిక
  2. పదవి బాధ్యతలు స్వీకరించిన పాలకవర్గం సభ్యులు
  3. శుభాకాంక్షలు తెలిపిన మాజీ డిసిసిబి చైర్మన్ పోచారం భాస్కర్‌రెడ్డి

బాన్సువాడ, ఫిబ్రవరి 16 (విజయ క్రాంతి): కామారెడ్డి జిల్లా బాన్సువాడ మున్సిపల్ చైర్మన్ గా కాసుల విజయ బాలరాజ్ సోమవారం ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. ఈనెల 11న జరిగిన ఎన్నికల్లో బాన్సువాడ మున్సిపాలిటీ 19 వార్డులు ఉండగా అందులో 11 వాళ్లను కాంగ్రెస్ పార్టీ కౌన్సిలర్ అభ్యర్థులు విజయం సాధించడం జరిగింది. కాంగ్రెస్ పార్టీ అధిష్టానం నుండి కాసుల విజయ మున్సిపల్ చైర్మన్ గా, వైస్ చైర్మన్ గా రేష్మ ఎజాజ్ లను పాలకవర్గం సభ్యులు ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు.

బాన్సువాడ ఎన్నికల అధికారి సబ్ కలెక్టర్ కిరణ్మయి వారిని అధికారికంగా ప్రకటించారు. బాన్సువాడ మున్సిపల్ చైర్మన్ గా కాసుల విజయ బాలరాజ్, వైస్ చైర్మన్ గా రేష్మ ఎజాజ్ లను సబ్ కలెక్టర్ వారిచే ప్రమాణస్వీకారం చేయించారు. మున్సిపల్ చైర్మన్ కు ఎంఐఎం పార్టీ మద్దతు తెలిపారు.

అంతకుముందు బాన్సువాడ మున్సిపాలిటీ నూతన కౌన్సిలర్లకు సబ్ కలెక్టర్ కిరణ్మయి వార్డుల వారిగా ప్రమాణస్వీకారం చేయించడం జరిగింది. నూతనంగా ఎన్నుకోబడిన పాలకవర్గానికి మాజీ డిసిసిబి చైర్మన్ పోచారం భాస్కర్ రెడ్డి శుభాకాంక్షలు తెలిపారు.వారిని ఘనంగా సన్మానించారు ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా బాన్సువాడ స్టేషన్ హౌస్ అధికారి తుల శ్రీధర్ ఆధ్వర్యంలో పోలీసు బందోబస్తు నిర్వహించారు.