23 May, 2026 | 7:07 PM

Breaking News

కొయ్యగుట్ట అమరవీరుల స్థూపానికి మరమ్మతులు చేపట్టండి   •   డబిల్ పూర్‌లో కాంగ్రెస్ వార్డు కౌన్సిలర్ ఆరిఫ్ పర్యటన   •   తాళం వేసి ఉన్న ఇల్లులే లక్ష్యంగా దొంగతనాలకు పాల్పడుతున్న ముఠా అరెస్ట్   •   తప్పులు మీరు చేసి నిందలు మాపై వేయడం సరికాదు   •   రామాయంపేటలో విషాదం.. బాధిత కుటుంబానికి కాంగ్రెస్ నేతల అండ   •   కష్టపడే కార్యకర్తలకు కాంగ్రెస్ పార్టీ గుర్తిస్తుంది   •   ఎమ్మెల్యే మున్సిపాలిటీ లో ఎక్స్ టెన్షన్ కౌంటర్ గా మార్చారు   •   చట్టాలపైన అవగాహన లేకనే కేసుల్లో ఇరుక్కుపోతున్నారు   •   ఇతర రాష్ట్రాల కార్మికుల వివరాల నమోదు ప్రక్రియ ప్రారంభం   •   చోరీ కేసులో నిందితుడు అరెస్ట్.. బంగారం, వెండి వస్తువుల స్వాధీనం   •  

కాటమయ్య రక్షణ కిట్లు.. గౌడ కులస్తులకు వరం

31-07-2025 12:24 AM

తుంగతుర్తి ఎమ్మెల్యే మందుల సామేలు

తుంగతుర్తి, జులై 30 : తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సహకారంతో కాటమయ్య రక్షణ కిట్లు గౌడ కులస్తులకు పంపిణీ చేయడం వరమని తుంగతుర్తి ఎమ్మెల్యే మందుల సామేలు అన్నారు.జిల్లాలోని తిరుమలగిరి మండల కేంద్రంలోని ఎమ్మెల్యే  క్యాంపు కార్యాలయంలో నియోజకవర్గ వ్యాప్తంగా ఉన్న వివిధ మండలాల గీత కార్మికులకు కాటమయ్య రక్షన కిట్ల ను  పంపిణీ చేసి మాట్లాడారు.

కల్లు గీత కార్మికులు తాటి చెట్లు ఎక్కినప్పుడు ప్రమాదాల బారిన పడకుండా ఉండేందుకు ఆధునిక టెక్నాలజీతో రూపొందించిన కిట్లను ప్రభుత్వం అందజేస్తుంద న్నారు. బీసీ కార్పొరేషన్, ఎక్సైజ్ శాఖల ద్వారా తెలంగాణ కల్లుగీత కార్మికుల సహకార ఆర్థిక సంఘం సహకారంతో సేఫ్టీ కిట్ల ను లబ్ధిదారులకు అందజేస్తున్నట్లు  తెలిపారు. గీత కార్మికులను ఆదుకోవడానికి ప్రభుత్వం సిద్ధంగా ఉందని తెలిపారు.

కుల వృత్తుల కు చేయూత అందించడానికి ప్రభుత్వం కట్టుబడి ఉందని అన్నారు. అనంతరం నూతన రేషన్ కార్డులు ఇండ్ల పట్టాలు పంపిణీ చేశారు. కార్యక్రమంలో మార్కెట్ చైర్ పర్సన్ ఎల్సోజు చామంతి నరేష్, డిసిసిబి డైరెక్టర్ గుడిపాటి సైదులు మార్కెట్ వైస్ చైర్మన్ చింతకుంట్ల వెంకన్న, దాసరి శీను, జమ్మిలాల్, కందుకూరు లక్ష్మయ్య తదితరులు పాల్గొన్నారు.