calender_icon.png 3 August, 2025 | 6:25 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

విద్యుత్ అంతరాయంపై రైతుల ఆందోళన

31-07-2025 12:24:45 AM

బెల్లంపల్లి అర్బన్, జూలై30: కన్నెపల్లి మండల కేంద్రంలో విద్యుత్ అంతరాయంపై అధికారుల నిర్లక్ష్యానికి నిరసనగా గ్రామస్తులు ఆందోళన దిగారు. బుధవారం కన్నెపల్లి సబ్స్టేషన్ ఎదుట రోడ్డుపై బైఠాయించి విద్యుత్ అధికారులు తీరుపై నిరసన తెలిపారు. విద్యుత్ అధికారుల తీరుతో  అష్ట కష్టాలు పడుతున్నామని  గ్రామస్తులు వాపోయారు. విద్యుత్తు సరఫరా నిలిచిపోయి నప్పుడు అధికారులు కనీస స్పందన లేదని గ్రామస్తులు ఆగ్రహం వ్యక్తం చేశారు. అధికారుల తీరుపై విసిగిపోయి సబ్ స్టేషన్ ముందు ధర్నా చేయక తప్పడం లేదని గ్రామస్తులు తెలిపారు.