31-07-2025 12:26:31 AM
మంచిర్యాల, జూలై 30 (విజయక్రాంతి) : మంచిర్యాలలోని మిమ్స్ జూనియర్ కళాశాల యాజమాన్యంపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తూ సహస్త్ర కుటుంబ సభ్యులు, విద్యార్థి సంఘాల నాయకులు బుధవారం మంచిర్యాల ఐబీ చౌరస్తాలో ఆందోళన నిర్వహించారు.
మిమ్స్ కళాశాల మూడవ అంత స్తు నుంచి పడి మృతి చెందిన సెకండియర్ విద్యార్థిని కొత్తపల్లి సహస్త్ర కుటుంబానికి న్యాయం చేయాలని కోరారు. అనుమతులు లేకుండా భవనం నడుపుతూ విద్యార్థుల ప్రాణాలతో చెలగాటమాడుతున్న యాజమాన్యంపై క్రిమినల్ కేసులు నమోదు చేయాలని డిమాండ్ చేశారు. కళాశాల నిర్వాహకుల నిర్ల క్ష్యం వల్లే ఈ విషాదం చోటుచేసుకుందని ఆరోపించారు.