17 April, 2026 | 11:10 PM

Breaking News

బీసీ ముద్దుబిడ్డ విదేశాల్లో ఐటి గ్రాడ్యుయేషన్ పూర్తి   •   ఎండల తీవ్రతపై అప్రమత్తంగా ఉండాలి   •   ప్రభుత్వాసుపత్రుల్లో ప్రజలకు నాణ్యమైన వైద్యం అందించాలి   •   శ్రీ సీతారామ చంద్ర, శ్రీ దుర్గ మల్లేశ్వర స్వాముల విగ్రహ ప్రతిష్ట.   •   అమావాస్య సందర్భంగా శ్రీ భగలాముఖి శక్తిపీఠంలో ప్రత్యేక పూజలు.!   •   రమేష్ గౌడ్‌పై పెట్టిన ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ కేసును వెంటనే రద్దు చేయాలి   •   అంధకారంలో వనదుర్గమ్మ భక్తులు   •   జాతీయస్థాయి బ్రోంజ్ డిస్క్ పురస్కారానికి ఎంపికైనా ఫైర్ కానిస్టేబుల్ వెంకటేశ్వర్లు   •   గోల్డెన్ అవర్ లో సరైన చర్యలు తీసుకుంటే ప్రాణాలను రక్షించవచ్చు   •   ఎస్ఎఫ్ఐ ఆధ్వర్యంలో విద్యార్థుల నిరసన   •  

కట్ల రంగారావుకు అ'పూర్వ' సన్మానం

16-06-2025 02:06 PM

తోటి స్నేహితుడు ఉన్నత పదవికి ఎంపికతో ఆనందోత్సాహాలు..

వైరా,(విజయక్రాంతి): తమతో చిన్నప్పుడు చదువుకున్న తోటి స్నేహితుడు ఉన్నత పదవికి ఎంపిక కావడం పట్ల చిన్ననాటి స్నేహితులు మదిలో హర్షాతిరేకాలు వెల్లివిరిసాయి. 1984-85  విద్యా సంవత్సరంలో  వైరాలోని  జీజేసీ, ప్రభుత్వ పాఠశాల పదవ తరగతిలో విద్యను అభ్యసించిన తోటి స్నేహితులు  తనతోపాటు చదువుకున్న ప్రస్తుతం రాష్ట్ర టిపిసిసి ప్రధాన కార్యదర్శిగా ఇటీవల ఎంపికైన  కట్ల రంగారావును సోమవారం వైరాలో ఘనంగా సన్మానించారు.

స్నేహితులంతా వైరాలోని   కట్ల రంగారావు స్వగృహానికి వెళ్లి   అందరూ ఆత్మీయ ఆలింగనం చేసుకొని  ఉన్నత పదవి ఎంపిక పట్ల హర్షం వ్యక్తం చేస్తూ శుభాకాంక్షలు తెలిపారు  స్నేహితులు శాలువాలతో  ఘనంగా సన్మానించి, పుష్పగుచ్చం అందించి మరెన్నో ఉన్నత పదవులు అధిరోహించాలని ఆకాంక్షించారు 1984 -85 సంవత్సరంలో వైరాలోని ప్రభుత్వ జిజేసి పాఠశాల నందు కలిసి చదువుకున్న రోజులు గుర్తు చేసుకున్నారు.

తమ స్నేహితుడికి కాంగ్రెస్ పార్టీలో రాష్ట్ర కమిటీ ప్రధాన కార్యదర్శిగా అవకాశం లభించడం పట్ల చాలా సంతోషంగా ఉందని, ఈ అవకాశం కల్పించినందుకు కేంద్ర మాజీ మంత్రివర్యులు రేణుక చౌదరి కి ప్రత్యేకమైన కృతజ్ఞతలు తెలియజేశారు. శుభాకాంక్షలు తెలియజేసిన వారిలో సూతకాని. కృపానందం, మల్లెల. రవీంద్ర ప్రసాద్, బత్తుల శ్రీనివాస్, బుగ్గినేని సైదులు,సయ్యద్ అతావుల్లా, గజ్జల నరసింహారావు, కట్ల కోటయ్య, షేక్ మస్తాన్, షేక్ మీరా, దానయ్య, చిట్టిబాబు, కరెంటు నాగేశ్వరరావు, చింతమాల రవికుమార్, కేశా రామారావు, బోనాల సీతారాములు తదితరులు ఉన్నారు