17 April, 2026 | 9:32 PM

Breaking News

జాతీయస్థాయి బ్రోంజ్ డిస్క్ పురస్కారానికి ఎంపికైనా ఫైర్ కానిస్టేబుల్ వెంకటేశ్వర్లు   •   గోల్డెన్ అవర్ లో సరైన చర్యలు తీసుకుంటే ప్రాణాలను రక్షించవచ్చు   •   ఎస్ఎఫ్ఐ ఆధ్వర్యంలో విద్యార్థుల నిరసన   •   ఉస్మానియా యూనివర్సిటీ పాలకమండలి ఈసీ సభ్యురాలుగా డాక్టర్ బి.సుజాత   •   కులగణన లెక్కలు పబ్లిక్ డొమైన్‌లోకి మల్లన్న నిరంతర పోరాట ఫలితం   •   ఉద్యోగుల సమస్యలు పరిష్కరించాలి   •   నార్సింగిలో ఉద్యోగుల నిరసన.. తహశీల్దార్‌కు వినతిపత్రం సమర్పణ   •   రోడ్డు ప్రమాద సమయంలో గోల్డెన్ అవర్ ప్రాముఖ్యతపై అవగాహన   •   విద్యుత్ షాక్‌తో పశువు మృతి   •   సమస్యలు పరిష్కరించాలని ఉద్యోగ, ఉపాధ్యాయుల నిరసన   •  

కేంద్రమంత్రి బండి సంజయ్‌కు హైకోర్టులో ఊరట

16-06-2025 02:00 PM

హైదరాబాద్: తెలంగాణ హైకోర్టులో(Telangana high courtమాజీ భారతీయ జనతా పార్టీ అధ్యక్షుడుకేంద్రమంత్రి బండి సంజయ్ కుమార్(Union Minister Bandi Sanjay)కి ఊరట లభించింది. బండి సంజయ్ పై నమోదైన కేసును హైకోర్టు సోమవారం కొట్టివేసింది. సూర్యాపేట జిల్లా పెన్ పహాడ్ పోలీస్ స్టేషన్ లో బండి సంజయ్ పై కేసు నమోదైంది. 2021 నవంబర్ 15న ఎమ్మెల్సీ ఎన్నికల సందర్భంగా బండి సంజయ్ ర్యాలీ నిర్వహించారు. అనుమతి లేకుండా కాన్వాయ్ నిర్వహించారని ఎన్నికల అధికారి ఫిర్యాదు చేశారు. ఫిర్యాదు మేరకు బండి సంజయ్ పై పెన్ పహాడ్ పోలీసులు(Penpahad Police Station) కేసు నమోదు చేశారు. ఈ కేసు నాంపల్లి ప్రజాప్రతినిధుల కోర్టులో పెండింగ్ లో ఉంది. తాజాగా విచారణ చేపట్టిన ధర్మాసనం బండి సంజయ్ పై కేసును కొట్టివేస్తూ ఉత్తర్వులు జారీ చేసింది.