01-10-2025 05:01:49 PM
హైదరాబాద్: నగరంలోని హబ్సిగూడ(Habsiguda)లో మద్యం తీసుకెళ్తున్న డీసీఎం వాహనంలో బుధవారం మంటలు చెలరేగాయి. వాహనం మంటల్లో చిక్కుకున్న వెంటనే అప్రమత్తమైన డ్రైవర్ వాహనాన్ని తక్షణమే నిలిపివేశాడు. స్థానికుల సహాయంతో మంటలను అదుపులోకి తీసుకువచ్చాడు. ఈ ప్రమాదంలో పలు మద్యం(liquor) సీసాలు పాక్షికంగా కాలిపోయాయి. కాగా, మద్యం సీసాలు చెల్లాచెదురుగా పడిపోవడంతో స్థానికులు వాటిని తీయడానికి పరుగెత్తారు. మద్యం సీసాలు పడిపోతున్న విషయం తెలుసుకున్న చుట్టుపక్కల ప్రాంతాల ప్రజలు సంఘటనా స్థలానికి చేరుకున్నారు. ఈ సంఘటన అక్కడ గందరగోళాన్ని సృష్టించింది.