23-09-2025 01:47:47 AM
-అందుకు మునుగుతున్న ప్రాంతాలు
-మహేశ్వరం బీజేపీ ఇన్‌చార్జి శ్రీరాములు
హైదరాబాద్, సెప్టెంబర్ 22 (విజయక్రాంతి): మహేశ్వరం నియోజకవర్గం బడంగ్‌పేట్ మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలోని గుర్రంగూడ గ్రామంలో గల సాయి దుర్గా కాలనీ, బృందావన్ కాలనీ, పంచాయతీరాజ్ కాలనీ, శ్రీనివాసపురం కాలనీ, గడ్డం ఎన్క్లేవ్, ఆదిత్య నగర్ కాలనీలు గత రాత్రి కురిసిన భారీ వర్షాలకు పూర్తిగా మునిగిపోయాయి.
ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని తెలిసి సోమవారం ఉదయాన్నే రంగారెడ్డి జిల్లా స్థానిక సంస్థల ఎన్నికల కన్వీనర్, మహేశ్వరం నియోజకవర్గ బీజేపీ ఇన్‌చార్జ్ అందెల శ్రీరాములు పర్యటించారు. ప్రజల సమస్యలు స్వయంగా అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా శ్రీరాములు మాట్లాడుతూ.. బీఆర్‌ఎస్, కాంగ్రెస్ ప్రభుత్వాల నిర్లక్ష్యంతోనే వర్షాకాలం వస్తే ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు.
అనంతరం బడంగ్ పేట్ కార్పొరేషన్ కమిషనర్ సరస్వతికి ఫోన్ చేసి పరిస్థితిని వివరించిన శ్రీరాములు.. సమస్యకు శాశ్వత పరిష్కారం కోసం వెంటనే చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. కార్పొరేషన్ బిజెపి అధ్యక్షుడు రామిడి వీరకర్ణరెడ్డి, మాజీ కార్పొరేటర్లు దడిగ శంకర్, గడ్డం లక్ష్మారెడ్డి, ప్రధాన కార్యదర్శి ఎల్చల భాస్కర్‌రెడ్డి, సీనియర్ నాయకులు జక్కడి మధుసూదన్ రెడ్డి, జంగా రెడ్డి, కార్యదర్శి మంజులా రాణి, కోశాధికారి జనార్దన్‌రెడ్డి పర్యటించారు.