21 April, 2026 | 5:07 PM

Breaking News

రేవంత్ స్థాయి ఏంటో ప్రజలకు అర్థమైంది.. కాంగ్రెస్ మళ్లీ గెలవదు!   •   ప్రజల దాహార్థి తీర్చడమే లక్ష్యం: సర్పంచ్ హీరాలాల్   •   మంచి చేయాలని సంకల్పం మనసులో ఉండాలి   •   డా. బీ.ఆర్ అంబేద్కర్ ఎక్సలేన్స్ 2026 అవార్డును అందుకున్న అచ్చమ్మకుంట తండా కుర్రాడు నేనావత్ అనిల్ కుమార్   •   అంగన్వాడీలో పోషక అభియాన్   •   ఇంటర్మీడియట్ మండల టాపర్ హారికను అభినందించిన పోలీసులు   •   మోదీ.. ఒక ఉగ్రవాది.. మల్లికార్జున ఖర్గే వివాదాస్పద వ్యాఖ్యలు   •   మేం ఏం చేసినా అడిగే వారెవ్వరు   •   కెసిఆర్ మెల్లకుంట తండాను జీపీగా ఏర్పాటు చేయకుంటే పట్టించుకునే నాదుడే ఉండేవాడు కాదు   •   రైతుల సంక్షేమమే ప్రభుత్వ ప్రథమ ధ్వేయం..   •  

జీవన్ రెడ్డి.. పచ్చి తెలంగాణ వ్యతిరేకి.. వెయ్యి ఏండ్లయినా BRS పార్టీ మారదు

21-04-2026 03:22 PM

బీఆర్ఎస్ ఉట్టి కథలు.. కాంగ్రెస్ పిట్ట కథలు

హైదరాబాద్: పార్టీ ఆవిర్భావ సభ ఏర్పాట్లు వేగంగా జరుగుతున్నాయని తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత(Kalvakuntla Kavitha) పేర్కొన్నారు. వాహనాలకు ఇబ్బంది లేకుండా చూడాలని డీజీపీని కవిత కోరారు. ఆర్టీసీ సమ్మెకు(RTC Strike) సంపూర్ణ మద్దతు ప్రకటిస్తున్నట్లు కవిత స్పష్టం చేశారు. రాష్ట్రంలో సమ్మె, నీటి సమస్యలు , ఫీజు రీఎంబర్స్ మెంట్(Fee Reimbursement) సమస్యలున్నాయని తెలిపారు. బీఆర్ఎస్ ఉట్టి కథలు.. కాంగ్రెస్ పిట్ట కథలు చెప్పిందని కవిత ఎద్దేవా చేశారు. తమ పార్టీలో యువతకు అవకాశాలు ఉంటాయని కవిత సూచించారు. బీఆర్ఎస్ పార్టీ కేంద్ర సమస్యలపై మాట్లాడలేదని కవిత విమర్శించారు. బీఆర్ఎస్ లో మహిళలకు ప్రాధాన్యం ఉండదని తెలిపారు. జీవన్ రెడ్డి పచ్చి తెలంగాణ వ్యతిరేకి అని కవిత స్పష్టం చేశారు. వెయ్యి ఏళ్లయినా కాంగ్రెస్, బీఆర్ఎస్ మారవన్నారు. ప్రజాసమస్యల పరిష్కారమే లక్ష్యంగా పనిచేస్తానని వెల్లడించారు.