16 May, 2026 | 1:57 AM

రెండున్నరేళ్లలో రాష్ట్రం ఆగమైందనడం విడ్డూరం: మంత్రి అడ్లూరి లక్ష్మణ్

21-04-2026 03:11 PM
  1. జీవన్ రెడ్డి అన్ని పదవులు అనుభవించి.. విమర్శించడం సరికాదు
  2. బీఆర్ఎస్ కు ప్రజలు బుద్ధి చెప్పడం ఖాయం

హైదరాబాద్: కేసీఆర్ వ్యాఖ్యలను మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమార్(Minister Adluri Laxman kumar) ఖండించారు. రెండున్నరేళ్లలోపే రాష్ట్రం ఆగమైందనడం విడ్డూరమని మంత్రి అడ్లూరి పేర్కొన్నారు. బీఆర్ఎస్ పాలనలో(BRS Government) రైతుబంధు డబ్బుల కోసం ఓఆర్ఆర్ ను కుదువపెట్టారని ఆరోపించారు. రాష్ట్రాన్ని అప్పుల పాలుచేసి వడ్డీలు కట్టలేక ఉద్యోగులకు జీతం ఇవ్వలేని స్థితికి తెచ్చారని అడ్లూరి ధ్వజమెత్తారు. గత పదేళ్లలో ప్రతిపక్ష నేతలు కనీసం మాట్లాడలేని పరిస్థితి ఉండేదన్నారు. జీవన్ రెడ్డి అన్ని పదవులు అనుభవించి ఇప్పుడు విమర్శించడం సరికాదని సూచించారు.

పార్టీ వీడవద్దని కాంగ్రెస్ నేతలు జీవన్ రెడ్డిని(Jeevan Reddy) కలిసి విజ్ఞప్తి చేశామన్నారు. వారం రోజుల్లో వడ్ల కొనుగోలు కేంద్రాలు ప్రారంభిస్తామని హామీ ఇచ్చారు. ధాన్యం కొనుగోళ్లపై కేంద్రమంత్రులను సీఎం కలిసినా స్పందన లేదన్నారు. వడ్ల కొనుగోళ్లు, యూరియా విషయంలో ఇబ్బందులు లేవని సూచించారు. 2028 ఎన్నికల్లో ప్రజలు బీఆర్ఎస్ పార్టీకి బుద్ధి చెబుతారని హెచ్చరించారు. జగిత్యాలలో సభ ఉన్న హరీశ్ రావు(Harish Rao) ఢిల్లీ వెళ్లడం వెనుక అంతర్యమేంటి? అని ప్రశ్నించారు. ఆరు గ్యారంటీలను కచ్చితంగా అమలు చేసి చూపిస్తామన్నారు.