8 June, 2026 | 4:26 PM

Breaking News

గ్రామ ప్రగతికి ప్రతి ఒక్కరు సహకరించాలి   •   ముదిరాజ్ సంఘానికి ప్రొసీడింగ్ అందజేసిన సర్పంచ్ గండి నారాయణ   •   శ్రీ కోటి లింగేశ్వర స్వామి ఆలయంలో ప్రత్యేక పూజలు   •   సీఎం రేవంత్‌ హిట్లర్‌ కామెంట్స్‌పై మంత్రి శ్రీధర్‌ బాబు వివరణ   •   గ్రామ పంచాయతీలో సమస్యలు పరిష్కారం కోసం కృషి చేస్తాం: తాహశీల్దార్   •   పూర్తి వేతనం విడుదల చేయాలని లెక్చరర్ల వినతి   •   మద్యం మత్తు వీడితేనే గ్రామాల అభివృద్ధి ముందుకు.!   •   పరిసరాలను పరిశుభ్రంగా ఉండేలా చూసుకోండి   •   ప్రజా పాలన-ప్రగతి ప్రణాళికలో భాగంగా గ్రామసభ   •   అయ్యప్ప ఆలయ నూతన కమిటీ అధ్యక్షుడు బొగ్గుల సురేష్‌కు సన్మానం   •  

భద్రాచలంలో ఘనంగా కేసీఆర్ జన్మదిన వేడుకలు

17-02-2026 08:24 PM

భద్రాచలం,(విజయక్రాంతి): తెలంగాణ రాష్ట్ర తొలి ముఖ్యమంత్రి బిఆర్ఎస్ పార్టీ అధినేత కలవకుండా చంద్రశేఖర రావు 72వ పుట్టినరోజు సందర్భంగా భద్రాచలం మండల పార్టీ ఆధ్వర్యంలో భద్రాచలం పార్టీ కార్యాలయం వద్ద సమావేశం ఏర్పాటు చేసి కేక్ కట్ చేసి మిఠాయిలు పంచి ఘనంగా పుట్టినరోజు వేడుకలు నిర్వహించారు. అనంతరం అభయాంజనేయ స్వామి పిల్లల పార్కు నందు కెసిఆర్ పుట్టినరోజు సందర్భంగా మొక్కలు నాటి వృక్షార్చన కార్యక్రమం నిర్వహించారు.

ఈ సందర్భంగా నియోజకవర్గ పార్టీ నాయకులు రావులపల్లి రాంప్రసాద్ మానే రామకృష్ణ మాట్లాడుతూ... నిండు నూరేళ్లు తెలంగాణ రాష్ట్ర సాధకుడు పోరాట యోధులు కేసీఆర్ సీతారామచంద్రస్వామి ఆశీస్సులతో ఆరోగ్యంగా ఉండి మూడవసారి తెలంగాణ రాష్ట్రానికి ముఖ్యమంత్రి కావాలని ఆకాంక్షించారు. ఈ కార్యక్రమంలో మండల పార్టీ నాయకులు, కార్యకర్తలు మహిళా విభాగం, యువజన విభాగం,అన్ని రంగాల నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు.