calender_icon.png 26 January, 2026 | 3:26 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

కేసీఆర్ గణతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు

26-01-2026 01:42:24 PM

హైదరాబాద్: తెలంగాణ ​రాష్ట్ర ప్రజలకు బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ గణతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు తెలిపారు. ​స్వతంత్ర భారతదేశంలో స్వయంపాలన అమలులోకి వచ్చి 77 సంవత్సరాలవుతున్న సందర్భంగా రాజ్యాంగం ప్రాముఖ్యతను కేసీఆర్ గుర్తుచేసుకున్నారు. ​తెలంగాణ రాష్ట్ర ఏర్పాటులో రాజ్యాంగం అందించిన ఆర్టికల్ 3 పోషించిన కీలక పాత్రను ఈ సందర్భంగా కేసీఆర్ స్మరించుకున్నారు. ​అన్నిరకాల వివక్షలకు దూరంగా, దేశ ప్రజలందరూ సమానత్వ భావనతో జీవిస్తూ, రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ ఆశయాలకు అనుగుణంగా, భారత సమాజం ముందుకు సాగాలని కేసీఆర్ ఆకాంక్షించారు. తెలంగాణలో రాజ్యాంగ హక్కులను కాపాడుకోవడానికి బీఆర్ఎస్ పార్టీ తన నిరంతర కృషిని కొనసాగిస్తుందని కేసీఆర్ పునరుద్ఘాటించారు.