calender_icon.png 26 January, 2026 | 4:25 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

కాకతీయ విశ్వవిద్యాలయంలో 77వ గణతంత్ర దినోత్సవ వేడుకలు

26-01-2026 02:17:39 PM

కాకతీయ యూనివర్సిటీ,జనవరి 26 ,(విజయక్రాంతి): కాకతీయ విశ్వవిద్యాలయాన్ని అన్ని రంగాల్లో ముందుకు తీసుకెళ్లే దిశగా సమిష్టిగా కృషి చేద్దాం” అని కాకతీయ విశ్వవిద్యాలయ వైస్‌ చాన్సలర్ ఆచార్య కే. ప్రతాప్‌ రెడ్డి పిలుపునిచ్చారు. విశ్వవిద్యాలయ రిజిస్ట్రార్ ఆచార్య వి. రామచంద్రం సారథ్యంలో పరిపాలన భవన ప్రాంగణంలో నిర్వహించిన 77వ గణతంత్ర దినోత్సవ వేడుకల్లో వైస్‌ చాన్సలర్ ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఎన్‌సీసీ కాడెట్ల గౌరవ వందనం స్వీకరించి, జాతీయ నాయకుల చిత్రపటాలకు పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. అనంతరం జాతీయ జెండాను ఆవిష్కరించి బోధన, బోధనేతర ఉద్యోగులు, పరిశోధకులు, విద్యార్థులు, విశ్రాంత ఉద్యోగులను ఉద్దేశించి ప్రసంగించారు.

విశ్వవిద్యాలయంలో పరిపాలనా, అకడమిక్, నిర్వహణ పరమైన సంస్కరణలు అమలవుతున్నాయని తెలిపారు. యూనివర్సిటీ లక్ష్యాలు వికసిత్ భారత్, రైజింగ్ తెలంగాణ దిశగా ఉన్నాయని పేర్కొన్నారు. ఇటీవల తెలంగాణ సైన్స్ కాంగ్రెస్‌ను విజయవంతంగా నిర్వహించినట్లు తెలిపారు. పరిశోధనలకు ప్రోత్సాహం అందించే దిశగా తొలిసారిగా వైస్‌ చాన్సలర్ అవార్డులు ప్రవేశపెట్టామని, వీటిలో బెస్ట్ పరిశోధన పాత్రలు, ప్రాజెక్ట్, పేటెంట్ల కు నగదు బహుమతులతో పాటు సర్టిఫికెట్లు అందిచామన్నారు. ముఖహాజరు గుర్తింపు విధానం అమల్లోకి వచ్చిందని, రూసా నిధులను వినియోగంలోకి తీసుకొచ్చామని తెలిపారు. డిగ్రీ, పీజీ విద్యార్థులకు నైపుణ్య శిక్షణపై ప్రత్యేక దృష్టి సారిస్తున్నామని చెప్పారు. మౌలిక వసతుల కల్పనలో భాగంగా డిజిటలైజేషన్, ఇంటర్నెట్ బ్యాండ్‌విడ్త్ పెంపు, బాలికల వసతి గృహంలో డైనింగ్ హాల్ నిర్మాణం, యూనివర్సిటీ కాంపౌండ్ వాల్ పనులు పురోగతిలో ఉన్నాయని పేర్కొన్నారు.

విద్యార్థులను సంపూర్ణంగా అభివృద్ధి చేసి ఇండస్ట్రీ రెడీగా తీర్చిదిద్దేందుకు, ఎన్.ఈ.పి. 2020, స్టేట్ అండ్ సెంట్రల్ విద్యా పాలసీ లకు అనుగుణంగా  యు.జి. కోర్స్ సిలబస్ రివైజ్ చేయటం, అమలు చేయటం జరిగిండ్, పి.జి. సిలబస్ కూడా సిద్దంగా ఉన్న్నం. అవసరమైన చర్యలు చేపడుతున్నామని తెలిపారు. భారత రాజ్యాంగం అత్యున్నతమైనదని, హక్కులతో పాటు బాధ్యతలను కూడా గుర్తించాల్సిన అవసరం ఉందన్నారు. ఈ సందర్భంగా గత 20 సంవత్సరాలుగా విశ్వవిద్యాలయం ప్రచురిస్తున్న కాకతీయ యూనివర్సిటీ న్యూస్‌లెటర్ (వివేచన) ను విడుదల చేశారు. అలాగే చరిత్ర విభాగ జర్నల్ “కాకతీయ journal అఫ్ హిస్టారికల్ స్టడీస్” , ఆంగ్ల విభాగ జర్నల్ “కాకతీయ జర్నల్ అఫ్ ఇంగ్లీష్ స్టడీస్”,  బోధన ఉద్యోగుల (అకుట్)  డైరీలను ఆవిష్కరించారు.

గణతంత్ర దినోత్సవాన్ని పురస్కరించుకుని ఒప్పంద అధ్యాపకులు, పార్ట్‌టైమ్ అధ్యాపకులు, విశ్రాంత ఉద్యోగులు నిర్వహించిన క్రీడా పోటీల విజేతలకు బహుమతులు అందజేశారు. ఈ కార్యక్రమంలో పాలక మండలి సభ్యులు ఆచార్య బి. సురేష్‌లాల్, డాక్టర్ బి. రమ, డాక్టర్ ఎన్. సుదర్శన్, డాక్టర్ చిర్రా రాజు, డాక్టర్ బి. సుకుమారి తదితరులు పాల్గొన్నారు. బోధన, బోధనేతర సిబ్బంది, పరిశోధకులు, విద్యార్థులు పెద్ద సంఖ్యలో హాజరయ్యారు. క్యాంపస్‌లో విశ్రాంత ఉద్యోగులు, బోధనేతర ఉద్యోగ సంఘాల ప్రతినిధులు కూడా జెండా ఆవిష్కరణ కార్యక్రమాల్లో పాల్గొన్నారు. ప్రజా సంబంధాల అధికారి డాక్టర్ పృథ్వీరాజ్ వల్ల్లాల సంయోజకులు గా వ్యవహరించారు.