26-01-2026 01:46:39 PM
కామారెడ్డి, జనవరి 26 (విజయ క్రాంతి): కామారెడ్డి జిల్లా దోమకొండ మండల ఎంపీడీవో గా విధులు నిర్వహిస్తున్న ప్రవీణ్ కుమార్ కు ఉత్తమ అవార్డుకు సోమవారం ఎంపికైనారు. కామారెడ్డి జిల్లా అదరపు (రెవెన్యూ) కలెక్టర్ విక్టర్ చేతుల మీదుగా ఉత్తమ అవార్డును అందుకున్నారు. దోమకొండ మండలంలో ఉత్తమ సేవలు అందించినందుకు గాను అవార్డు వరించింది. దీనిపై మండల ప్రజలు ఆయనను అభినందించారు.