26-01-2026 01:45:34 PM
బెల్లంపల్లి, (విజయ క్రాంతి): సమ్మక్క జాతరను పురస్కరించుకొని బెల్లంపల్లి కొత్త బస్టాండ్ లో భక్తుల కోసం ఏర్పాటు చేసిన బస్ సర్వీసులను సోమవారం బెల్లంపల్లి ఎమ్మెల్యే గడ్డం వినోద్, సబ్ కలెక్టర్ మనోజ్ ప్రారంభించారు. బస్టాండ్లో సమ్మక భక్తుల కోసం తాగునీటి సదుపాయాన్ని కల్పించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే గడ్డం వినోద్ మాట్లాడారు. సమ్మక్క జాతర కోసం వెళ్లే భక్తులకోసం బెల్లంపల్లి కొత్త బస్టాండ్ నుంచి ప్రత్యేక బస్సు సదుపాయాన్ని కల్పించామన్నారు. ఈ అవకాశాన్ని ప్రయాణికులు చేసుకోవాలన్నారు. ఈ కార్యక్రమంలో బెల్లంపల్లి, పీసీసీ సభ్యుడు తిరుమల చిలుముల శంకర్, పట్టణ అధ్యక్షుడు మల్లయ్య, మాజీ కౌన్సిలర్ రోడ్డ శారద ఆసిఫాద్ డిపో అధికారులు సిబ్బంది పాల్గొన్నారు.