calender_icon.png 26 January, 2026 | 6:20 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

మున్సిపల్ 10వ వార్డు బరిలో శ్రీకాంత్

26-01-2026 03:11:32 PM

యువ నాయకుడికి జై కొడుతున్న కాలనీవాసులు

తాండూరు,(విజయక్రాంతి): త్వరలో జరగనున్న మున్సిపల్ ఎన్నికల్లో పోటీ చేసేందుకు యువకులు ఉత్సాహాన్ని చూపిస్తున్నారు. యువకులకు అవకాశం ఇచ్చేందుకు వివిధ రాజకీయ నాయకులు గెలుపు గుర్రాలను ఎంపిక చేసినందుకు తీవ్ర కసరత్తును చేస్తున్నాయి. వికారాబాద్ జిల్లా తాండూర్ మున్సిపల్ పరిధిలోని 10వ వార్డు నుండి కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా అల్లాపూర్ శ్రీకాంత్ ను పోటీలో నిలిపేందుకు ఆ పార్టీ నాయకులు సిద్ధమవుతున్నారు.

యువతలో శ్రీకాంత్ కు నుంచి పట్టు ఉండడంతో పాటు కాలనీవాసుల సమస్యలను తీర్చడంలో వెన్నంటి ఉండడంతో స్థానిక ప్రజలతో అతనికి సత్సంబంధాలు ఉన్నాయి. దీంతో పదవ వార్డు ప్రజలు మరియు యువకులు శ్రీకాంత్ అభ్యర్థిత్వాన్ని జై కొడుతున్నారు. ఈ సందర్భంగా శ్రీకాంత్ మీడియాతో మాట్లాడుతూ... కాంగ్రెస్ పార్టీ ప్రవేశపెట్టిన పథకాలను ఎమ్మెల్యే మనోహర్ రెడ్డి  సహకారంతో ప్రతి ఇంటికి అందేలా కృషి చేస్తానని అన్నారు.