26-01-2026 01:44:13 PM
ప్రజా సంఘాల కార్యాలయంలో త్రివర్ణ పతాకాన్ని ఆవిష్కరించిన కెవిపిఎస్ జిల్లా కార్యదర్శి దుర్గం దినకర్
కుమ్రం భీం ఆసిఫాబాద్( విజయక్రాంతి):గణతంత్ర దినోత్సవాన్ని పురస్కరించుకొని జిల్లా కేంద్రంలోని ప్రజా సంఘాల కార్యాలయంలో కెవిపిఎస్ జిల్లా కార్యదర్శి దుర్గం దినకర్ త్రివర్ణ పతాకాన్ని ఆవిష్కరించారు.ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ దేశ స్వాతంత్ర్యానికి తమ ప్రాణాలను అర్పించిన మహానీయుల త్యాగాలను స్మరించుకోవడం ప్రతి పౌరుని బాధ్యత అని అన్నారు. రాజ్యాంగ విలువలను కాపాడుకుంటూ సమాజ అభివృద్ధికి ప్రతి ఒక్కరూ కృషి చేయాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో ప్రజా సంఘాల నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.