26-01-2026 02:14:21 PM
బెల్లంపల్లి, (విజయ క్రాంతి): మంచిర్యాల జిల్లా బెల్లంపల్లిలో గణతంత్ర దినోత్సవాన్ని పురస్కరించుకొని మార్వాడి యువ మంచ్ ఆధ్వర్యంలో సోమవారం రక్తదాన శిబిరం నిర్వహించారు. ఈ రక్తదానం శిబిరానికి అనూహ్యంగా స్పందన కనిపించింది. 70మంది యువకులు స్వచ్ఛందంగా రక్తదానం చేశారు. ఈ కార్యక్రమంలో మార్వాడి యువ మంచ్ అధ్యక్షులు కృష్ణ కాంత్ సోనీ, సెక్రటరీ బాల ప్రసాద్ మారు, జాయింట్ సెక్రెటరీ విజయ్ నా హోటి, చంద్రకాంత్తోష్ నివాళ్, ట్రెజరర్ కమల్ లాహోటి, ఉపాధ్యక్షుడు అరవింద్ అగర్వాల్, రక్తదాన క్యాంపు చైర్మన్ అఖిల్ జవర్, క్యాంపు కన్వీనర్ రాజేందర్ లాహోటి తదితరులు పాల్గొన్నారు.