26-01-2026 02:09:43 PM
అధైర్య పడకండి బీఆర్ఎస్ మీకు తోడుంది
బీఆర్ఎస్ ఖానాపూర్ నియోజకవర్గ ఇన్చార్జ్ భూక్య జాన్సన్ నాయక్
ఖానాపూర్ (విజయ క్రాంతి): నిర్మల్ జిల్లా ఖానాపూర్ నియోజకవర్గంలో ఉన్న ఆటో డ్రైవర్లకు ఎల్లవేళలా అండగా ఉంటానని అధైర్య పడవద్దు అని డ్రైవర్లకు ఆత్మీయ భరోసా క్రింద జీవిత బీమా చేస్తున్నామని ఖానాపూర్ టిఆర్ఎస్ నియోజకవర్గ ఇన్చార్జ్ భూక్య ఝాన్సన్ నాయక్ అన్నారు .గణతంత్ర దినోత్సవం పురస్కరించుకొని సోమవారం నియోజకవర్గ కేంద్రం ఖానాపూర్ లో ఆటో డ్రైవర్లకు ఆత్మీయ భరోసా పేరున న్యూ ఇండియా ఇన్సూరెన్స్ లో గ్రూప్ ఇన్సూరెన్స్ చేశారు.
.బస్టాండ్ సమీపంలో నిర్వహించిన ఒక కార్యక్రమంలో ఆయన మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం 420 మోసపూరిత వాగ్దానాలు చేసి ప్రజలను వంచించిందని, దానిలో భాగంగానే ఆటో డ్రైవర్లకు ప్రతినెల 1200 ఇస్తామని హామీ ఇచ్చి రెండేళ్లు గడిచినా నెరవేర్చడం లేదని దాంతో ప్రభుత్వం తీసుకున్న తప్పుడు నిర్ణయాలతో అనేక మంది ఆటో డ్రైవర్లు కుటుంబాన్ని పోషించుకోలేక ఆత్మహత్యల పాలవుతున్నారని ఇటీవల నియోజకవర్గంలోని జన్నారం మండలంలో ఒక కుటుంబం లో డ్రైవర్ ఆత్మహత్య చేసుకోగా ఆయనకున్న భార్య చిన్నపిల్లలు వీధిపాలయ్యారని ఆయన బాధ వెలిబుచ్చారు.
ఈ నేపథ్యంలోనే బిఆర్ఎస్ పార్టీ తరఫున ఆటో డ్రైవర్లను ఆదుకునేందుకు తాను ఆత్మీయ భరోసా పేరున ప్రతి ఒక్క కుటుంబానికి 5 లక్షల రూపాయలు అందేలాగా ఇన్సూరెన్స్ చేపిస్తున్నామని డ్రైవర్ కుటుంబాలు అధైర్యపడవద్దని వారికి అండగా నేను, టిఆర్ఎస్ పార్టీ ఉంటుందని ఆయన అన్నారు. ఈ కార్యక్రమంలో ఆ పార్టీ మండల అధ్యక్ష కార్యదర్శులు తాళ్లపల్లి రాజ గంగన్న, మాజీ మార్కెట్ కమిటీ చైర్మన్ సకారం శ్రీనివాస్ ,గౌరీకర్ రాజు, డాక్టర్ కే హెచ్ కాన్ ,తోట సుమిత్ ,దివాకర్, పలువురు ఆ పార్టీ నాయకులు ఉన్నారు.