calender_icon.png 12 November, 2025 | 7:31 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

ప్రజల అభివృద్ధి సంక్షేమమే కేసీఆర్ లక్ష్యం

12-11-2025 05:53:02 PM

కోరుట్ల ఎమ్మెల్యే కల్వకుంట్ల సంజయ్..

కోరుట్ల రూరల్ (విజయక్రాంతి): తెలంగాణ ప్రజల అభివృద్ధి ప్రజల సంక్షేమం కోసమే కేసిఆర్ ప్రభుత్వం పని చేసిందని కోరుట్ల ఎమ్మెల్యే కల్వకుంట్ల సంజయ్ అన్నారు. బుధవారం పట్టణంలోని ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో మండలానికి సంబంధించిన కల్యాణ లక్ష్మి, షాదీ ముబారక్ చెక్కులను, సీఎం సహాయ నిధి చెక్కులను లబ్ధిదారులకు పంపిణీ చేశారు. కోరుట్ల మండలానికి చెందిన ₹2,98,000/-(రెండు లక్షల తొంభై ఎనిమిది వేల రూపాయల) విలువగల 13 సీఎంఆర్ఎఫ్, 143 కళ్యాణ లక్ష్మి, షాది ముబారక్ చెక్కులను అందజేశారు. పేద యువతి వివాహానికి ఆర్థికంగా అండగా నిలుస్తున్న కళ్యాణ లక్ష్మి, షాదీ ముబారక్ చెక్కులను శాతం అందజేశారు.

ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ... ప్రజలకు తులం బంగారం ఇస్తామని చెప్పి ఇంతవరకు ఇవ్వలేదనీ, 420 హామీలు నెరవేరుస్తామన్న వాగ్దానం కేవలం మాటల్లోనే మిగిలిపోయిందని అన్నారు. అబద్ధాలు, వంచనలతో అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ ప్రభుత్వం ప్రజలను తీవ్ర ఇబ్బందులకు గురిచేస్తోందని ఆవేదన వ్యక్తం చేశారు.రైతులు, మహిళలు, విద్యార్థులు, వృద్ధులు అందరూ ప్రభుత్వ నిర్లక్ష్యానికి బలవుతున్నారని పేర్కొన్నారు. బీఆర్‌ఎస్ ప్రభుత్వం ప్రజల సంక్షేమం కోసం రూపకల్పన చేసిన కళ్యాణ లక్ష్మి, షాదీ ముబారక్, రైతు బంధు, రైతు బీమా వంటి పథకాలు వేలాది కుటుంబాలకు ఆర్థిక భరోసా కలిగించాయని తెలిపారు. ఈ కార్యక్రమంలో కోరుట్ల మండల అధ్యక్షులు దారిశెట్టి రాజేష్, గేల్లా శ్రీనివాస్, అనతడుపుల అంజయ్య, రాజ్ కుమార్, గెల్ల గంగాధర్ తదితరులు పాల్గొన్నారు.