12-11-2025 05:58:28 PM
నిర్మల్ (విజయక్రాంతి): నిర్మల్ పట్టణంలోని వెంకటాద్రి పేట ఖజానా చెరువులో గత రెండు రోజుల నుంచి ముసలి పిల్లలు బయటకు రావడంతో జనాలు బెంబేలెత్తిపోతున్నారు. నీటిలో ఉన్న ముసల్లు నీటి బయట ఉన్న ఒడ్డుకు చేరుకుని సందడి చేయడంతో స్థానికులు వాటిని వీడియోలు తీసి వైరల్ చేయడం వల్ల చెరువులకు వెళ్లేవారు భయభ్రాంతులకు గురవుతున్నారు.