calender_icon.png 5 September, 2025 | 3:51 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

కేసీఆర్, హరీశ్ రావు జైలుకు వెళ్లడం ఖాయం

04-09-2025 12:02:19 AM

- అవినీతికి పాల్పడకపోతే సిబిఐ అంటే భయం ఎందుకు 

- కాంగ్రెస్ పార్టీ నాయకులు హరికృష్ణ ఆత్తు ఇమామ్

సిద్ధిపేట, సెప్టెంబరు 3 (విజయక్రాంతి): కాలేశ్వరం ప్రాజెక్టు నిర్మాణంలో జరిగిన లక్ష కోట్ల అవినీతిలో మాజీ సీఎం కెసిఆర్, మాజీమంత్రి హరీష్ రావులు జైలుకూ వెళ్లడం ఖా యమని సిద్ధిపేట కాంగ్రెస్ పార్టీ నియోజకవర్గ ఇంచార్జ్ పూజల హరి కృష్ణ, కాంగ్రెస్ పార్టీ పట్టణ అధ్యక్షులు అత్తు ఇమామ్ అ న్నారు. సిద్ధిపేట పట్టనంలో 9 వ వార్డులో రూ.28 లక్షలతో సీసీ రోడ్లు నిర్మాణంకు బు ధవారం కొబ్బరికాయ కొట్టి పనులు ప్రారంభించి మాట్లాడారు.

కాలేశ్వరం ప్రాజెక్టు నిర్మాణంలో అవినీతి జరిగిందని అన్ని పా ర్టీల నాయకులు చెప్పారని అందుకే కాంగ్రెస్ ప్రభుత్వం రిటైర్ జడ్జి ఘోష్ తో కమిటి వేసి విచారణ జరిపించారన్నారు. అసెంబ్లిలో తీ ర్మానం చేసి కేంద్రానికి సిబిఐతో విచారణ చేయించాలని ప్రభుత్వం తీసుకున్న నిర్ణ యం రాష్ట్ర ప్రజలు అభినందిస్తున్నారని తెలిపారు. కాలేశ్వరం ప్రాజెక్టులో మీరు అవినీతి చేయనప్పుడు సీబీఐ అంటే బీఆర్‌ఎస్ కు భయమెందుకని ప్రశ్నించారు. 10 సంవత్సరాలు అధికారంలో ఉన్నప్పుడు ఇష్టానుసా రంగా దోచుకున్నారు.

కాబట్టే కెసిఆర్, హరీ ష్ రావు ముందుగానే కోర్టులను ఆశ్రయించారని విమర్శించారు. మీరు తప్పు చేశారు కాబట్టే కమీషన్ల పేరుతో కోట్లు వసూలు చేశారని మండిపడ్డారు. కాలేశ్వరం ప్రాజెక్టులో అవినీతి జరిగిందని కెసిఆర్ బిడ్డ కవి తనే ప్రెస్ మీట్ పెట్టి చెప్పిందని, నిజాలు చె ప్పినందుకే కవితను పార్టీ నుండి సస్పెండ్ చేశారని వెల్లడించారు. అవినీతి జరిగిందం టూ కెసిఆర్, హరీష్ రావులను నిలదీయాల్సిన బిఆర్‌ఎస్ నాయకులు మతి భ్రమించి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పై విమర్శలు చేయడం సిగ్గుచేటన్నారు. సిబిఐ విచారణకు వెళ్లిన బిఆర్‌ఎస్ పార్టీ తెలంగాణలో వారి దుకాణం మూసుకోవాల్సిందేన్నారు. ఈ కా ర్యక్రమంలో ముద్దం లక్ష్మి, సాకి ఆనంద్, ఆ లకుంట మహేందర్, పయ్యావుల ఎల్లం, పూజల గోపికృష్ణ, గయాజుద్దీన్, కలిముద్దీన్, మధు తదితరులు పాల్గొన్నారు.