calender_icon.png 5 September, 2025 | 5:54 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

దివ్యాంగుల పెన్షన్లను పెంచాలి

04-09-2025 12:04:17 AM

  1. 8న  అన్ని జిల్లాల కలెక్టరేట్లలో ముట్టడి
  2. పెన్షన్లపై దాటవేత ధోరణిగా పనికిరాదు
  3. ఎమ్మార్పీఎస్ అధ్యక్షుడు మందకృష్ణ మాదిగ

ఖైరతాబాద్, సెప్టెంబర్ 3 (విజయ క్రాంతి) : కాంగ్రెస్ పార్టీ ఎన్నికల హామీ ప్రకారం రాష్ట్రంలోని దివ్యాంగులకు పెన్షన్లను  పెంచి, కొత్త పెన్షన్ దారులకు అవ కాశం కల్పించాలని మాదిగ రిజర్వేషన్ పోరాట సమితి వ్యవస్థాపక అధ్యక్షులు మం దకృష్ణ మాదిగ ప్రభుత్వాన్ని డిమాండ్ చేశా రు. లేనిపక్షంలో ఈ నెల 8 నుంచి నెలరోజులపాటు రాష్ట్రవ్యాప్తంగా నిరసన కార్య క్రమా లు తెలియజేస్తామని హెచ్చరించారు.

ఈ మేరకు బుధవారం సోమాజిగూడ ప్రెస్ క్లబ్ లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో వికలాంగుల హక్కుల పోరాట సమి తి, ఎంఎస్‌పి నాయకులతో కలిసి భవిష్యత్తు కార్యాచరణను ప్రకటించారు. అనంత రం ఆయన మాట్లాడుతూ.. రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారం చేపట్టి 20 నెలలు గడుస్తున్న  దివ్యాంగులకు పెన్షన్ పెంపు విషయంలో దాటవేత ధోరణిని అవలంబిస్తుందని అన్నా రు.

ఈ నేపథ్యంలో ప్రభుత్వంపై ఒత్తిడి తెచ్చేందుకు ఎమ్మార్పీఎస్, ఎంఎస్‌పి,వి హెచ్‌పిఎస్, వివిధ అనుబంధ సంఘాలతో కలిసి  రాష్ట్రవ్యాప్త నిరసన కార్యక్రమాలు తెలియజేయునట్లు తెలిపారు. దీనిలో భాగం గా ఈ నెల 8న అన్ని జిల్లాల కలెక్టరేట్ కార్యాలయాల ముట్టడి మొదలుకొని వివిధ రూ పాల్లో నెలరోజుల పాటు వివిధ నిరసన కార్యక్రమాలు చేపట్టనున్నట్లు తెలిపారు.