28 July, 2026 | 4:45 PM

కేసీఆర్ పాత్ర లేదు

30-05-2024 12:59 AM

ఎఫ్‌డీసీ మాజీ చైర్మన్ వంటేరు ప్రతాప్‌రెడ్డి 

గజ్వేల్, మే29: ఫోన్ ట్యాపింగ్‌తో కేసీఆర్‌కు ఎలాంటి సంబంధం లేదని, కాంగ్రెస్ తన అసమర్థ పాలనను కప్పిపుచ్చుకోవడానికే ఈ అంశాన్ని తెరపైకి తెచ్చారని ఎఫ్‌డీసీ మాజీ చైర్మన్ వంటేరు ప్రతాప్‌రెడ్డి అన్నారు. గజ్వేల్‌లోని ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో ఆయన బుధవారం మాట్లాడుతూ... కాంగ్రెస్ ప్రభుత్వం ప్రజాపాలనలో అన్నివిధాల విఫలమయ్యిందన్నారు. 14 సంవత్సరాలు పోరాడి సాధించిన ప్రత్యేక తెలంగాణ రాష్ట్రాన్ని తొలి సీఎంగా కేసీఆర్ బాధ్యతలు చేపట్టి పదేండ్లలో అన్నివిధాల అభివృద్ధి చేశారన్నారు. రైతులు, వ్యవసాయాభివృద్ధి కోసం కాళేశ్వరం ప్రాజెక్టు నిర్మించి, రైతుబంధు, రైతుబీమా, ఉచిత విద్యుత్‌తో రైతులకు అండగా నిలిచారన్నారు.

33 జిల్లాలను ఏర్పాటు చేసి అన్ని జిల్లాల్లో కలెక్టరేట్‌లను, అద్భుతమైన దవాఖానలను నిర్మించి పరిపాలనా సౌలభ్యంతో పాటు ఆర్యోగ తెలంగాణగా తీర్చిదిద్దిన ఘనత కేసీఆర్‌దేనన్నారు. కాళేశ్వరం, సచివాలయం, యాదాద్రి లాంటి గొప్ప కట్టడాలు కేసీఆర్ చేసిన అభివృద్ధికి నిదర్శనంగా నిలిచాయన్నారు. విద్యాపరంగా మోడల్ పాఠశాలలు, వివిధ గురుకులాలను, యూనివర్సిటీలు, వైద్య కళాశాలలను ఏర్పాటు చేశారన్నారు. తెలంగాణ లోగోలో కాకతీయ తోరణం, హైద్రాబాద్‌లోని చార్మినార్‌ను తొలగించి చరిత్రను మరిచిపో యేలా కుట్ర చేస్తున్నారని ఆరోపించా రు.

ప్రజావ్యతిరేక కాంగ్రెస్ పాలనను ప్రజల్లోకి తీసుకువెళ్లి పోరాటాలు చేసి కాంగ్రెస్ ప్రభుత్వ వైఖరిని ఎండగడతామన్నారు. జూన్ 1న నియోజక వర్గం నుండి హైద్రాబాద్ గన్‌పార్కు వరకు వెళ్లి కొవ్వొత్తుల ర్యాలీలో నాయకులు, కార్యకర్తలు పాల్గొంటారన్నారు. 2వ తేదీన అన్ని గ్రామాల్లో జెండావిష్కరణలు, సాయంత్రం కేసీఆర్ సారథ్యంలో సమావేశం నిర్వహి స్తామన్నారు. 3న జిల్లా కేంద్రంలో బీఆర్‌ఎస్ సమావేశం జరుగుతుందన్నారు. కార్యక్రమాలను నాయకులు, కార్యకర్తలు విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు. సమావేశంలో మా జీ ఏఎంసీ చైర్మన్ మాదాసు శ్రీనివా స్, రాష్ట్ర నాయకులు దేవి రవీందర్, జుబేర్‌పాషా, నాయకులు కుమార్‌యాదవ్, నరేశ్, కొన్యాల బాల్‌రెడ్డి, నాగరాజు, శ్రీనివాస్, ఉపేందర్‌రెడ్డి, నాగరాజు తదితరులు పాల్గొన్నారు.