28 July, 2026 | 5:28 PM

ధాన్యం చుట్టూ దగా!

30-05-2024 12:57 AM

వరి కోతలు మొదలుకాగానే రాష్ట్రవ్యాప్తంగా వేలసంఖ్యలో కొనుగోలు కేంద్రాలుపెట్టి ప్రభుత్వం నేరుగా రైతుల నుంచి ధాన్యం కొంటున్నది. రైతులకు వెంటనే డబ్బులు చెల్లించి ఆ ధాన్యాన్ని బియ్యంగా మార్చి సీఎంఆర్ కింద ఎఫ్‌సీఐకి ఇచ్చేందుకుగాను మిల్లర్లకు సరఫరా చేస్తున్నది. అయితే వడ్లు మిల్లుకు వెళ్తున్నాయి కానీ.. బియ్యం మాత్రం బయటకు రావటం లేదు. సర్కారు సరుకుతో కొందరు మిల్లర్లు సొంత వ్యాపారం చేసుకొంటున్నారు. ప్రభుత్వానికి సరఫరా చేయాల్సిన బియ్యాన్ని బహిరంగ మార్కెట్లో అధిక ధరలకు అమ్ముకొని సొమ్ము చేసుకొంటున్నారు.

ఇలాంటివారిపై చర్యలు తీసుకొని బియ్యాన్నయినా, లేదంటే అందుకు తగిన డబ్బులైనా ముక్కుపిండి వసూలు చేయాల్సిన ప్రభుత్వం ఆ అంశాన్ని పట్టించుకోవటమే లేదు. తర్వాతి పంటకాలంలో కూడా ఆ మిల్లర్లకే మళ్లీ కోట్ల విలువైన ధాన్యాన్ని సరఫరా చేస్తున్నది. మిల్లర్లు మళ్లీ అదే పనిచేస్తున్నారు. దీంతోపౌర సరఫరాల శాఖ వేలకోట్ల అప్పుల్లో కూరుకుపోతుండగా, రాష్ట్రప్రభుత్వం సీఎంఆర్ ఇవ్వటంలేదంటూ ఎఫ్‌సీఐ నిందలు మోపుతున్నది. 

సర్కారు సరుకుతో మిల్లర్ల జల్సా

సీఎంఆర్ ఇవ్వకుండా బయట విక్రయం

ఏటా కోట్లు వెనుకేసుకొంటున్న మిల్లర్లు

పాత బకాయిలున్నా మళ్లీ ధాన్యం సరఫరా

ప్రభుత్వ అలసత్వంతో అక్రమార్కుల ఆట

కామారెడ్డి, సూర్యాపేటలో ఇష్టారాజ్యం

కామారెడ్డి/సూర్యాపేట, మే 2౯ (విజయక్రాంతి): రాష్ట్రంలో కొందరు రైస్ మిల్లర్లు ఇష్టారాజ్యంగా వ్యవహరి స్తున్నారు. ప్రభుత్వ సరుకుతో సొంత వ్యాపారాలు చేసుకొంటున్నారు. సీఎం ఆర్ కింద ఎఫ్‌సీఐకి సరఫరా చేయా ల్సిన బియ్యాన్ని బహిరంగ మార్కెట్లో అమ్ముకొని సొమ్ము చేసుకొంటు న్నారు. అప్పుడో ఇప్పుడో ఒకరిద్దరు మిల్లర్లపై ప్రభుత్వం నిషేధం విధిస్తే.. మరుసటి పంటకాలంలో పేర్లు మార్చు కొని మళ్లీ అదే పనిచేస్తున్నారనే విమ ర్శలు వినిపిస్తున్నాయి. కామారెడ్డి జిల్లాలో 2022-23 రబీ సీజన్‌లో 163 రైస్‌మిల్లు యజమానులు 4,73,871 మెట్రిక్ టన్నుల ధాన్యాన్ని తీసుకు న్నారు.

ప్రభుత్వానికి 126 మంది మిల్ల ర్లు తిరిగి 2,94,218 మెట్రిక్ టన్నుల సీఎంఆర్ బియ్యాన్ని అప్పగించారు. మరో 3౭ మంది మిల్లర్లు 23,౨౭౬ మెట్రిక్ టన్నుల బియ్యాన్ని ప్రభుత్వానికి అప్పగించాల్సి ఉంది. కానీ, ఇప్పటివరకు ఇవ్వలేదు. సీఎంఆర్ ఇవ్వని మిల్లర్లపై కఠిన చర్యలు తీసుకొంటామని ప్రభుత్వం ఇటీవల హెచ్చరించటంతో కామారెడ్డి జిల్లాలోని బిచ్కుందకు చెందిన ఒక మిల్లర్ 121.883 మెట్రిక్ టన్నుల బియ్యాన్ని ప్రభుత్వానికి అప్పగించారు.

ఇంకా 36 మంది 23,154 మెట్రిక్ టన్నుల బియ్యం బకాయి పడ్డారు. ప్రభుత్వం హెచ్చరించినా వాళ్లు స్పందించకపోవటం చూస్తుంటే.. ప్రభుత్వం ఇచ్చిన ధా న్యాన్ని వారు ఎప్పుడో బహిరంగ మార్కెట్లో అమ్ముకొన్నట్టు అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. గత ప్రభుత్వ ఉదాసీనత, ప్రజా ప్రతినిధుల అండదండలు ఉండటంతోనే మిల్లర్లు ఇష్టంవచ్చినట్టుగా చెలరేగిపోతున్నారనే విమర్శలు వినిపిస్తున్నాయి.  


ఏ గ్యారెంటీ లేదు

చిన్నపాటి లోన్ తీసుకొంటేనే సవాలక్ష ప్రశ్నలు వేసి, ఏదో ఒక ఆస్థిని కుదువపెటుకొంటారు. కానీ, గత ప్రభుత్వం వేలకోట్ల విలువైన ధాన్యాన్ని మిల్లర్లకు ఆయాచితంగా సరఫరాచేసింది. మిల్లర్ల నుంచి ఏ విధమైన సెక్యూరిటీ డిపాజిట్ కానీ, బ్యాంక్ గ్యారెంటీ కానీ తీసుకోలేదు. దీంతో ప్రభుత్వానికి బియ్యం ఇవ్వకపోయినా ఏం చేస్తుందిలే అన్న దీమాతో మిల్లర్లు సర్కారు బియ్యాన్ని సొంత సరుకులాగా బహిరంగ మార్కెట్లో అమ్ముకొంటున్నారనే విమర్శలు ఉన్నాయి.

చాలా జిల్లాల్లో మిల్లుల యజమానులు ఇతరులకు వాటిని లీజుకు ఇస్తున్నారు. లీజుకు తీసుకొన్నవారు ప్రభుత్వం నుంచి ధాన్యం తీసుకొని మిల్లుల్లో బియ్యంగా మార్చి బహిరంగ మార్కెట్లో అమ్ముకొని వెళ్లిపోతున్నారు. వారి నుంచి ప్రభుత్వం ఎలాంటి సెక్యూరిటీ డిపాజిట్లు తీసుకోకపోవటంతో సర్కారు సొమ్ము అమ్మేసుకొని అవతల పడుతున్నారు.  

రూపం మార్చుకొని దందా

రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత సీఎంఆర్ బకాయిపడ్డ మిల్లర్ల వివరాలు బయటకు తీస్తున్నది. అవసరమైతే మిల్లులను సీజ్‌చేయాలని అధికా రులను ఆదేశించినట్టు సమాచారం. దీంతో లీజుకిచ్చిన మిల్లుల యజమానులు లబోదిబోమంటున్నారు. లీజుకు తీసుకున్న వ్యాపా రి తప్పుచేస్తే తమ ఆస్తులు జప్తు చేయటమేంటని ప్రశ్నిస్తున్నారు. ప్రభుత్వం కఠినంగా వ్యవహరించే సూచనలు కనిపిస్తుండటంతో మిల్లర్ల ఓనర్లు లీజుకు తీసుకొన్నవారిని నిలదీస్తున్నారు. తమ ఆస్తులు జప్తు అయితే మీదే బాధ్యత అని హెచ్చరిస్తున్నారు.

దీంతో ఆ అక్రమార్కులు కొత్త ఎత్తులు వేస్తున్నారు. తమ సంస్థల పేర్లు మార్చి ఈ ఏడాది మళ్లీ ప్రభుత్వం నుంచి ధాన్యం తీసుకొంటున్నా రు. దాన్ని మరాడించి ప్రస్తుత సీఎంఆర్‌తోపాటు గత బకాయిలు సరఫరా చేయాలని ప్రయత్నాలు చేస్తున్నట్టు తెలిసింది. కామారెడ్డి జిల్లాలో ఈ యాసంగిలో 83 మంది సొంత మిల్లర్లు, 40 మంది లీజు మిల్లర్లు ధాన్యం తీసుకొన్నట్టు పౌరసరఫరాల శాఖ అధికారులు తెలిపారు. మరో వారంలో ధాన్యం కొనుగోలు ప్రక్రియ ముగుస్తుందని, ఆ తర్వాత సీఎంఆర్ బకాయిదారులపై చర్యలు తీసుకొంటామని పౌరసరఫరాల శాఖాధికారి మల్లికార్జున్ బాబు తెలిపారు. 

సూర్యాపేట జిల్లాలోనూ అదే తంతు

సీఎంఆర్ సరఫరాలో సూర్యాపేటలోనూ కొందరు మిల్లర్లు చేతివాటం చూపుతున్నారు. ఒక సీజన్‌లో కేటాయించిన ధాన్యాన్ని బయట అమ్ముకొని.. తర్వాత సీజన్‌లో కేటాయించిన ధాన్యంతో సీఎంఆర్ బాకాయి పూడ్చే ప్రయత్నం చేశారు. ప్రతి సీజన్‌లో సీఎంఆర్ బకాయి పడుతున్నా.. ప్రభుత్వం మళ్లీ వారికే ధాన్యం సరఫరా చేస్తుండటంతో మిల్లర్లు అదే అలవాటుగా మార్చుకొన్నారు. జిల్లాలో చాలా మిల్లులు ప్రభుత్వానికి కోట్లాది రూపాయల బకాయిలు పడ్డాయి. ప్రభుత్వం ప్రతి సీజన్‌లో సీఎంఆర్ సేకరణ గడువు పెంచుతుండటంతో అక్రమార్కులకు ఇంకా సౌకర్యంగా మారింది.

కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక ౨౦౧౯ మార్చి నుంచి ఖరీఫ్ నుంచి 2022 రబీ వరకు పెండింగ్‌లో ఉన్న సీఎంఆర్‌ను పూర్తిగా చెల్లించాలని మిల్లర్లకు నోటీసులు జారీ చేసింది. కానీ మిల్లర్లు ఏప్రిల్ చివరి నాటికి కూడా లక్ష్యం పూర్తి చేయలేక పోయారు. 2019 వానకాలం నుంచి 2021 వేసవి వరకు మొత్తం ఆరు సీజన్లలో 30,203 మెట్రిక్ టన్నుల సీఎంఆర్‌ను దాదాపు 15 మంది మిల్లర్లు బకాయి పడ్డారు. 2022 వానకాలం సీజన్‌కు సంబంధించి జిల్లాలో 7 మిల్లులు 21,379 మెట్రిక్ టన్నుల రైస్ బకాయి ఉన్నాయి. ఈ సీజన్‌లో పెండింగ్ సీఎంఆర్ సేకరణ ఇక  ఉండదని, బకాయిదారులపై చర్యలు తీసుకొంటామని సివిల్ సప్లయ్ అధికారులు తెలిపారు.

2022 వేసవి సీజన్‌కు సంబంధించిన 2,07,636 మెట్రిక్ టన్నుల ధాన్యాన్ని టెండర్ ద్వారా విక్రయించారు. 2023 వానకాలం సీజన్ ధాన్యం సీఎంఆర్ సేకరణ కొనసాగుతున్నది. జిల్లాలో 72 మిల్లులుండగా ప్రతి సీజన్‌లో ఒకటిరెండు మినహా అన్నింటికి ధాన్యం కేటాయిస్తున్నారు. కొందరు మిల్లర్లు తెలివిగా గడువులోగా కొంత మేర సీఎంఆర్ సప్లయ్ చేస్తూ బ్లాక్‌లిస్టులో పడకుండా జాగ్రత్త పడుతున్నారు.

అధికారులు అన్ని మిల్లులో కాకుండా ప్రతిపక్ష పార్టీలకు సం బంధించినవారి మిల్లులో మాత్రమే తనిఖీలు చేస్తున్నారనే విమర్శలు కూడా ఉన్నా యి. మిల్లుల్లో ధాన్యం నిలువలు లేకున్నా అధికారులకు ముడుపులు ముట్టచెప్తూ మిల్లర్లు ఎప్పటికప్పుడు తప్పించుకొంటున్నారనే ఆరోపణలు గుప్పుమంటున్నాయి. సీఎంఆర్ అప్పగించని కారణంగా ఇటీవల సూర్యాపేట జిల్లా రైస్ మిల్లర్ల సంఘం అధ్యక్షున్ని అరెస్ట్ చేశారు. దీంతో బకాయిపడ్డ మిల్లర్లలో ఆందోళన మొదలైంది. 

మిల్లు యాజమానిపై కేసు నమోదు

మంచిర్యాల: ప్రభుత్వానికి సీఎంఆర్ బియ్యం ఇవ్వని మిల్లు యాజమానిపై సివిల్ సప్లయ్ అధికారులు క్రిమినల్ కేసు నమోదు చేశారు. మంచిర్యాల జిల్లా జైపూర్ మండలం ఇందారం గ్రామంలోని శివసాయి ఇండస్ట్రీస్ రైస్‌మిల్ రూ.1.29 కోట్ల విలువైన సీఎంఆర్ బియ్యం పక్కదారి పట్టించినట్టు గుర్తించిన సివిల్ సప్లయ్ అధికారులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. పోలీసులు క్రిమినల్ కేసు నమోదు చేశారని సివిల్ సప్లయ్ డీఎం గెడం గోపాల్ తెలిపారు.   

పౌరసరఫరాల్లో ఆరో వేలు పెత్తనం!

మిల్లర్ల అసోసియేషన్‌కు పెద్దపీట
పౌరసరఫరాల శాఖపై ఆధిపత్యం
కీలక నిర్ణయాలను ప్రభావితం చేస్తున్న వైనం

హైదరాబాద్, మే 2౯ (విజయక్రాంతి): రాష్ట్రంలో ప్రజలతో అత్యంత ప్రభావితంగా ఉండే శాఖల్లో పౌరసరఫరాల శాఖది ప్రత్యేకత అనే చెప్పాలి. రైతులు పండించిన ధాన్యాన్ని కొనుగోలు చేయడం నుంచి, దానిని మిల్లర్లకు పంపించి.. ఎఫ్‌సీఐకి రవాణాచేస్తుంది. రాష్ట్ర ప్రజల అవసరాల కోసం, రేషన్ దుకాణాలను ఏర్పాటుచేసి, వాటికి కావాల్సిన బియ్యాన్ని, ఇతర సరుకులను సరఫరా చేస్తుంది.  అలాంటి ముఖ్యమైన శాఖలో ఆరోవేలు పెత్తనం చేస్తోంది. పౌరసరఫరాల శాఖకు, మిల్లర్‌కు మధ్యన అజమాయిషీ చెలాయిస్తూ.. అనేక ముఖ్యమైన నిర్ణయాలను ప్రభావితం చేస్తున్నట్టు ఈ ఆరో వేలుపై తీవ్ర విమర్శలు వస్తున్నాయి. పెత్తనం చేస్తున్న 
 
ఈ ఆరోవేలు మరేంటో కాదు.. మిల్లర్ల అసోసియేషన్లు.

పౌరసరఫరాల శాఖ నిర్వహించే కార్యకలాపాల్లో అత్యంత కీలకమైన తతంగం ధాన్యాన్ని మిల్లింగు చేసి.. తిరిగి ప్రభుత్వానికి సీఎంఆర్ (కస్టమ్ మిల్లింగ్ రైస్) అప్పజెప్పడం. ఈ ప్రక్రియను మిల్లర్లు పూర్తిచేసి వచ్చిన ధాన్యాన్ని (సీఎంఆర్)ను ప్రభుత్వ గోదాములకు తరలిస్తుంటారు. ఇక్కడే మిల్లర్ల మాయాజాలం ... మిల్లర్ల అసోసియేషన్ రూపంలో కనపడుతోంది. వాస్తవానికి సివిల్ సప్లు శాఖ, మిల్లర్ మధ్యన ఒప్పందం ప్రకారం ప్రభుత్వం నుంచి వచ్చిన ధాన్యాన్ని మిల్లింగు చేసి తిరిగి బియ్యాన్ని ప్రభుత్వం గోదాములకు పంపించాలి. కానీ ఈ పని చేయడానికి సదరు జిల్లా మిల్లర్ల అసోసియేషన్ నుంచి అండర్‌టేకింగ్ లెటర్‌కూడా ఇవ్వాల్సి ఉంటుందనే నిబంధన కారణంగా ఎక్కడ లేని పెత్తనాన్ని అసోసియేషన్‌కు అప్పజెప్పుతున్నారు.

అలాగే ఎవరైనా రైస్ మిల్ పేరును మార్చుకున్నా ఇదే నిబంధన ప్రకారం సదరు జిల్లా మిల్లర్ల అసోసియేషన్ నుంచికూడా అండర్‌టేకింగ్ లేఖను జతచేయాల్సి వస్తోం ది. దీనితో మిల్లర్ల అసోసియేషన్ అనేది రాజ్యాంగబద్ధమైన సంస్థరూపాన్ని సంతరించుకుంటుందనే విమర్శలు వస్తున్నాయి. వాస్తవాలను పరిశీలిస్తే.. ధాన్యాన్ని తీసుకుని మిల్లింగుచేసి బియ్యాన్ని ప్రభుత్వానికి అప్పజెప్పడానికి సంబంధించి మిల్లరు నుంచి పౌరసరఫరాల శాఖ ముందుగానే జాగ్రత్త పడుతుంది. చెక్కులు, సెక్యూరిటీల రూపం లో మిల్లరు బియ్యాన్ని ఎగవేయకుండా చూసుకుంటుంది.

కానీ ఇక్కడ మిల్లర్ల అసోసియేషన్ అండర్‌టేకింగ్ ఎందుకనేది ఎవరికీ అర్థం కావడం లేదు. ఒకసారి పౌరసరఫరాల శాఖ మిల్లకురు ధాన్యాన్ని అప్పగించి, బి య్యాన్ని గోదాములకు తెప్పించుకోవడంతో పని అయిపోతుంది. కానీ ఇలా చేయడానికి మిల్లర్ల అసోసియేషన్ అండర్ టేకింగ్ ఎందుకు? ఒకవేళ అసోసియేషన్ నుంచి అండర్‌టేకింగ్ లేఖ ఇవ్వకపోతే.. ప్రభుత్వం సంస్థ అయిన పౌరసరఫరాల శాఖ ఇచ్చిన ఉత్తర్వులను ఉపసంహరించుకుంటుందా.. అనే అనుమానాలను రేకెత్తిస్తోంది. ఇక్కడే మిల్లర్ల అసోసియేషన్ పెత్తనానికి దిగుతుందనే విమర్శలు వస్తున్నాయి.

ఒకవేళ రెండు, మూడు అసోసియేషన్లు ఉంటే.. ఎలా.. ఎవరు అండర్ టేకింగ్ ఇవ్వాలనేది తెలియదు. ఈ నిబంధన వల్ల మిల్లర్లు ఒక బృందంగా ఏర్పడి ప్రభుత్వంపై, ప్రభుత్వ సంస్థ అయిన సివిల్ సప్లుపై ఒత్తిడి తీసుకొచ్చే స్థాయికి చేరుకున్నారు. నిజానికి అసోసియేషన్లు అనేవి ఉండాలి. ప్రభుత్వానికి, సంస్థ లకు మధ్యన తలెత్తే లోటుపాట్లను సవరించడానికి, సమస్యలను ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్ళి పరిష్కరించడానికి అసోసియేషన్లు క్రియాశీలకంగా వ్యవహరించాలి.

మెడికల్, ఇరిగేషన్, రియల్‌ఎస్టేల్ లాంటి అన్ని రంగాల్లో ఉన్న అసోసియేషన్లుకూడా ఇదే చేస్తుంటాయి. కానీ మిల్లర్ల అసోసియేషన్ నుంచి అండర్‌టేకింగ్ లేఖ ఉంటే గానీ.. మిల్లర్లకు ధాన్యాన్ని కేటాయించడం చేయమని, మిల్లర్ పేరు మార్చినా అంగీకరిం చాలంటే అసోసియేషన్ అండర్‌టేకింగ్ ఉండటమనేది ప్రభుత్వ శాఖపై అజమాయిషీకి ఆరోవేలు లాంటిదనే విమర్శకు దారితీస్తోంది.

పోనీ అసోసియేషన్ ఇచ్చే అండర్‌టేకింగ్‌కు కట్టుబడి... ఎవరైనా మిల్లర్ బియ్యాన్ని ఇవ్వకపోతే.. ఆ బాధ్యత తీసుకుని బియ్యాన్ని అప్పజెప్పుతుందా అంటే అదీలేదు. మరి అలాంటప్పుడు అసోసియేషన్ల అండర్‌టేకింగ్ అనేది ఎందుకు?. కేవలం ప్రభుత్వ శాఖపై, ప్రభుత్వంపై ఒత్తిడి తీసుకురావడం ద్వారా మిల్లర్లు.. ప్రజాధానాన్ని కొల్లగొట్టడానికే ఈ నిబంధనను ఉపయోగించుకుంటు న్నారనే అపవాదు వినపడుతోంది.

ఇప్పటికైనా ప్రభుత్వం దీనిని పరిశీలించి.. అసోసియేషన్ అండర్‌టేకింగ్ అనే నిబంధనను పూర్తిగా మార్చి వేయాల్సిన అవసరం ఉంది. ప్రజాధనాన్ని దుర్వినియోగం కాకుం డా చూడాల్సిన అవసరముంది. మిల్లరు సంక్షేమానికి అసోసియేషన్ ఉండాలి కానీ.. అండర్‌టేకింగ్ అనే నిబంధనను తొలగిస్తే.. పౌరసరఫరాల శాఖ స్వతంత్రంగా పనిచేసే అవకాశం ఉంటుంది.