త్వరలో సోనాల మండల కేంద్రంలో అవుట్ పోస్ట్ ఏర్పాటు చేస్తాం
ఎస్పీకి విన్నవిస్తున్న సోనాల గ్రామస్తులు
బోథ్,(విజయక్రాంతి): సోనాల మండల కేంద్రంలో సీసీ కెమెరాలను ఏర్పాటు చేయడం జరిగిందని అంతేగాక గ్రామంలో ప్లాస్టిక్ను నిషేధిస్తున్నామని గ్రామస్తులు మంగళవారం ఆదిలాబాద్ జిల్లా ఎస్పీ అఖిల్ మహాజన్ కు వివరించారు. గ్రామంలో జరిగే వేడుకలలో ప్లాస్టిక్ ప్లేట్లను వినియోగించవద్దని తెలుపుతూ గ్రామంలో స్టీల్ బ్యాంక్ ఏర్పాటు చేసి ప్లేట్లు గ్లాసులను అందుబాటులో ఉంచుతున్నామని వారు వివరించారు. ఆటో డ్రైవర్లకు ఇన్సూరెన్స్ చేస్తున్నామని గ్రామపంచాయతీ ఆధ్వర్యంలో చేస్తున్న కార్యక్రమాలకు సహకరించాలని ఎస్పీకి విన్నవించారు
గ్రామంలో పోలీస్ స్టేషన్ ఏర్పాటు చేయాలని కోరగా త్వరలో గ్రామం కి వచ్చి పర్యటిస్తానని అవుట్ పోస్ట్ ఏర్పాటు చేస్తామని గ్రామస్తులకు తెలిపారు తుల శ్రీనివాస్ వెల్ఫేర్ సొసైటీ ఆధ్వర్యంలో మరిన్ని సేవా కార్యక్రమాలను చేపడతామని మాజీ ఎంపీపీ తుల శ్రీనివాస్ పేర్కొన్నారు హెల్మెట్ వినియోగం పైన అవగాహన కల్పించాలని అంతేగాక హెల్మెట్లను పంపిణీ చేయాలని ఎస్పీ సూచించినట్లు వారు పేర్కొన్నారు త్వరలోనే హెల్మెట్లను సైతం అందిస్తామని మాజీ ఎంపీపీ తెలపడం జరిగింది ఆయన వెంట ఉప సర్పంచ్ తుల శ్రీకాంత్ యువ నాయకుడు సుధీర్ రెడ్డి ఈర్ల అభిలాష్ తదితరులు పాల్గొన్నారు






