21 April, 2026 | 8:57 PM

కొండపైన షాపులను రద్దు చేసి.. నిరుద్యోగులకు షాపులను ఇవ్వాలి

21-04-2026 07:49 PM

బిజెపి పట్టణ అధ్యక్షులు కర్రె ప్రవీణ్

యాదగిరిగుట్ట,(విజయక్రాంతి): యాదగిరిగుట్ట కొండపైన వర్తక సంఘం షాపులను రద్దుచేసి నిరుద్యోగులకు షాపులను కేటాయించాలని మంగళవారం బిజెపి పట్టణ శాఖ ఆధ్వర్యంలో  దేవదాయ ధర్మాదాయ ప్రిన్సిపల్ సెక్రెటరీ, కమిషనర్ ని కలిసి వినతి పత్రం అందజేయడం జరిగిందని బిజెపి పట్టణ అధ్యక్షుడు కర్రె ప్రవీణ్ తెలిపారు.

ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఎన్నో ఏండ్లుగా కొండపైన దుకాణాలను ఏర్పాటు చేసుకొని వాటిని రెన్యువల్ చేస్తూ టెండర్ వేయకుండా వివిధ రాజకీయ పార్టీల, ప్రభుత్వ అధికారూలను అడ్డం పెట్టుకొని దేవస్థానం ఆదాయానికి గండి కొడుతున్నటువంటి వర్తక సంఘాన్ని తక్షణం రద్దు చేయాలని స్థానిక యువకులకు ఉపాధి కల్పించాలని కోరినట్లు తెలిపారు.

ఎండోమెంట్ చట్టం ప్రకారం దుకాణాన్ని కూడా ఇన్ని సార్లు రేన్యువల్ చేయడం చట్ట విరుద్ధం అని ఈ చట్టాలు వీళ్లకు వర్తిచావా అని రేన్యువల్ కోసం భారీ ఎత్తున డబ్బులు చేతులు మారేందుకు సమయం ఆసన్నమైందని ఈసారి గనుక షాపులను రెన్యువల్ చేస్తే ఊరుకునే ప్రసక్తే లేదని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో పట్టణ ప్రధాన కార్యదర్శి మందోజి నరేష్ శివరాత్రి శ్రీశైలం ,బోగా అజయ్ ,శ్రీనాథ్ ,విజయ్ ,ప్రవీణ్ శ్యామ్ పాల్గొన్నారు.