calender_icon.png 3 August, 2025 | 11:36 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

కేసీఆర్ మరో సీతయ్య

03-08-2025 12:18:21 AM

ఫిషరీస్ కార్పొరేషన్ చైర్మన్ మెట్టు సాయికుమార్

హైదరాబాద్, ఆగస్టు 2 (విజయక్రాంతి): మాజీ సీఎం కేసీఆర్ మరో సీతయ్య అని, నయాపైసా పనిచేయకుండా ప్రతిపక్షనేతగా కేసీఆర్ జీతం తీసుకుంటున్నారని ఫిషరీస్ కార్పొరేషన్ చైర్మన్ మెట్టు సాయికుమార్ ఎద్దేవా చేశారు. గాంధీభవన్‌లో మీడియాతో మాట్లాడుతూ..

ప్రతిపక్షనేతగా కేసీఆర్ 18 నెలలో రూ. 49.50 లక్షల జీతం తీసుకున్నారని, సీఎం రేవంత్‌రెడ్డి పదే పదే అసెంబ్లీకి రావాలని ఆహ్వానించినా కేసీఆర్ ఫా ంహౌస్‌కే పరిమితమయ్యారని విమర్శించారు. ఇలాంటి వెసులుబాటు ప్రపంచంలో ఏ శాసనసభ్యుడికి ఉ ండకపోవచ్చన్నారు. తెలంగాణలో ప్రతిపక్షం లేదని పేర్కొన్నారు. వచ్చే అసెంబ్లీ సమావేశాలకైనా కేసీఆర్ హాజరవ్వాలని డిమాండ్ చేశారు.