03-08-2025 12:17:59 AM
శంకర్ పల్లి: శంకర్ పల్లి మున్సిపల్ పరిధిలోని స్థానికి శ్మశాన వాటిక దారి పక్కన గల సర్వే నెంబర్ 220 లోని ప్రభుత్వ భూమి రక్షణకు రెవెన్యూ, ఇరిగేషన్ శాఖ అధికారులు చర్యలు తీసుకుంటున్నారు. శనివారం గతంలో శంకర్ పల్లి మండల తహసీల్దార్గా పని చేసిన వసంతకుమారి ఆధ్వర్యంలో సూచిక బోర్డు పాతారు. ఆరు నెలల కింద అక్కడ ఉన్న ప్రభుత్వ బోర్డును కొందరు వ్యక్తులు తొలగించారు. ఈ విషయం అధికారుల దృష్టికి రావడంతో మళ్లీ బోర్డు ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమంలో రెవెన్యూ శాఖ అధికారి సుప్రియ, ఇరిగేషన్ ఏఈ గోపీనాథ్, స్థానిక వర్క్ ఇన్ స్పెక్టర్ లింగం సిబ్బంది పాల్గొన్నారు.