03-08-2025 12:19:06 AM
సీపీఎస్ రద్దుకై పీఆర్టీయూ ఆధ్వర్యంలో నిర్వహణ
హైదరాబాద్, ఆగస్టు 2 (విజయక్రాంతి): కాంట్రిబ్యూటరీ పెన్షన్ స్కీం (సీపీఎస్)ను రద్దు చేయాలని డిమాండ్ చేస్తూ పీఆర్టీయూటీఎస్ ఆధ్వర్యంలో ఉపాధ్యాయులు పోరాటానికి సిద్ధమవుతున్నారు. సెప్టెంబర్ 1 పెన్షన్ విద్రోహదినం రోజున వేలాది మందితో హైదరాబాద్‌లోని ఇందిరాపార్క్ వద్ద మహాధర్నాను పీఆర్టీయూటీఎస్ నేతలు చేపట్టనున్నారు.
ఉద్యోగ, ఉపాధ్యాయుల భవిష్యత్తును అంధకారం చేస్తున్న సీపీఎస్ విధానాన్ని రద్దు చేసి, ఓపీఎస్ అమలు చేయాలని డిమాండ్ చేయనున్నారు. ఈ మహాధర్నాలో పాల్గొనేలా ఆ సంఘం నేతలు తొలుత జిల్లా పర్యటనలు చేస్తూ ఉపాధ్యాయ లోకాన్ని సంఘటితం చేస్తున్నారు.