11-08-2025 12:33:34 AM
బీఆర్‌ఎస్ పార్టీలో చేరిన ఆదివాసీ యువకులు
ఆదిలాబాద్, ఆగస్టు 10 (విజయ క్రాంతి) : ఆదివాసీల గూడా లను గ్రామ పంచాయతీలుగా మార్చిన ఘనత తెలంగాణ తొలి సీఎం కేసీఆర్ కే దక్కిందని బోథ్ ఎమ్మెల్యే అనిల్ జాదవ్ అన్నారు. ప్రస్తుత కాంగ్రెస్ ప్రభుత్వం పై ప్రజలకు నమ్మకం సన్నగిల్లిందని పేర్కొన్నారు.
నేరడిగొండ మండలంలోని పీచర గ్రామానికి చెందిన ఆదివాసీ యువకుడు సోమేశ్ ఆధ్వర్యంలో పీచర, గుత్పల, రోల్ మామడ, రెంగన్వాడీ, పిప్రి, మంగల మోట, ఎల్లమ్మ గూడ, గొదుమల్లు, దన్నుర్ గ్రామాలకు చెందిన ఆదివాసీ యువకులు ఆదివారం ఎమ్మెల్యే సమక్షంలో బీఆర్‌ఎస్ పార్టీలో చేరారు.
ఎమ్మెల్యే అనిల్ జాధవ్ మాట్లాడుతూ ఆదివాసీల కోరికలను తీర్చి వారి గ్రామాల్లో వారినే సర్పంచులు చేసిన కేసీఆర్ ను బీఆర్‌ఎస్ పార్టీని మర్చిపోవద్దని అన్నారు. పోడు కష్టాలను చూసిన ఆనాటి ముఖ్యమంత్రి కేసీఆర్ పోడు పట్టాలు ఇచ్చి ఆదుకున్నారని గుర్తు చేశారు.