calender_icon.png 13 August, 2025 | 1:03 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

మంత్రికుంటలో ఘనంగా పోచమ్మతల్లి విగ్రహ ప్రతిష్టాపన

11-08-2025 12:34:18 AM

పటాన్ చెరు(జిన్నారం), ఆగస్టు 10 : గడ్డపోతారం మున్సిపల్ పరిధిలోని మంత్రికుంటలో పోచమ్మ తల్లి విగ్రహ ప్రతిష్టాపన ఆదివారం వైభవంగా జరిగింది. ఉదయం నుంచి సాయంత్రం వరకు ఆధ్యాత్మిక కార్యక్రమాలు, పూజలతో భక్తులు భక్తి పారవశ్యంలో మునిగిపోయారు. ఈ విగ్రహ ప్రతిష్టకు ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి, బీఆర్‌ఎస్ జిల్లా నాయకులు వెంకటేశంగౌడ్, గోవర్దన్ రెడ్డి, మాజీ జెడ్పీటీసీ కొలను బాల్ రెడ్డి, ప్రకాశం చారి, కాంగ్రెస్ మహిళ జిల్లా అధ్యక్షురాలు కాట సుధారాణి, మాజీ ఎంపీపీ రవీందర్ గౌడ్, బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షుడు శ్రీకాంత్ రెడ్డి, పార్టీ మండల అధ్యక్షుడు వడ్డె కృష్ణ తదితర నాయకులు హాజరై ఆలయ కమిటీ ప్రతినిధులతో కలిసి అమ్మవారిని దర్శించుకొని పూజలు చేశారు. అమ్మవారి దయతో ప్రజలం దరు సుభిక్షంగా ఉండాలని కోరారు.

ఆలయ నిర్మాణానికి గోవర్దన్ రెడ్డి రూ.లక్షా నూట పద హారు విరాళం అందజేశారు. ఎమ్మెల్యే మాట్లాడుతూ దేవాలయాలు మన సంస్కృతి సంప్రదా యాలకు ప్రతీకలని అన్నారు. ఈ కార్యక్రమంలో అమీన్ పూర్ మాజీ ఎంపీపీ దేవానంద్, బీఆర్ ఎస్ మండల అధ్యక్షుడు రాజేశ్, మాజీ సర్పంచ్ లు సురేందర్ గౌడ్, జనార్దన్, ఆంజనేయులు, ఖదీర్, నాయకులు సార నరేందర్, శ్రీనివాస్ రెడ్డి,పెంటేశ్, ఆది ఆంజనేయులు, ఆది అనీల్, కాంగ్రెస్ నాయకులు కలాలి రాజుగౌడ్, ఎల్లయ్య,  రాజు తదితరులు పాల్గొన్నారు.