calender_icon.png 26 December, 2025 | 5:44 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

కేసీఆరే తెలంగాణకు నెంబర్ వన్ ద్రోహి

26-12-2025 02:10:54 AM

  1. కేసీఆర్‌పైన సీఎం రేవంత్‌రెడ్డి భాష ఏమాత్రం సరికాదు 
  2. సర్కార్‌పై సొంత పార్టీ ఎమ్మెల్యేల నుంచే తిరుగుబాటు 
  3. కేంద్ర మంత్రి బండి సంజయ్ స్పష్టీకరణ 

హైదరాబాద్, డిసెంబర్  25 (విజయక్రాంతి) : కృష్ణా జలాల విషయంలో తెలంగాణకు జరిగిన అన్యాయానికి కేసీఆరే ప్రధాన కారణమని కేంద్ర మంత్రి బండి సంజయ్ అన్నారు. ‘తెలంగాణకు రావాల్సిన 575 టీఎంసీల వాటా కాదని, కేవలం 299 టీఎంసీలకే అంగీకరించి, తెలంగాణకు నష్టం చేసి న కేసీఆర్ నెంబర్ వన్ ద్రోహి’ అని ఘాటు గా విమర్శించారు. నాటి అపెక్స్ కమిటీ సమావేశంలో జగన్మోహన్‌రెడ్డి సమక్షంలో జరిగిన ఒప్పందాలన బయటపెట్టేందుకు తాము సిద్ధమన్నారు. గురువారం బీజేపీ కార్యాలయంలో బండి సంజయ్ మీడియా తో చిట్ చాట్ నిర్వహించారు.

కేసీఆర్ కుటుంబం తెలంగాణకు పట్టిన శని అని, ఆ కుటుంబం తప్ప రాష్ట్రంలో ఇంకెవరూ బా గుపడలేదని ఆయన ఆరోపించారు. కేటీఆర్‌కు అధికారం పోయినా అహంకారం ఏమాత్రం తగ్గలేదన్నారు. మాజీ సీఎం కేసీఆర్‌పై సీఎం రేవంత్‌రెడ్డి ప్రయోగిస్తున్న భాష ఏమాత్రం సరైంది కాదన్నారు. రాష్ట్ర క్యాబినెట్‌లోని ఇద్దరు, ముగ్గురు మంత్రులు చట్టంలోని లొసుగులను ఆసరగా చేసుకుని వేల కోట్ల రూపాయిల అక్రమాలకు పాల్పడుతున్నారని, వారి అక్రమాలపై ఇప్పటికి ఇంటెలిజెన్స్ ద్వారా నివేదికలు తెప్పించుకుంటున్నామని బండి సంజయ్ తెలిపారు.

త్వరలోనే ఆ మంత్రుల భాగోతాన్ని బయటపెడుతానని ఆయన హెచ్చరించారు. కాంగ్రె స్ ఎమ్మెల్యేలు నైరాశ్యంలో ఉన్నారని, వారు తిరగబడే రోజులు దగ్గర్లోనే ఉన్నాయని, ఇందుకోసం రహస్య సమావేశాలు జరుగుతున్నాయని బండి సంజయ్ సంచలన వ్యాఖ్యలు చేశారు. రాష్ట్రంలో రాబోయేది బీజేపీ ప్రభుత్వమేనని తెలిపారు, పార్టీ ఫిరాయింపు ఎమ్మెల్యేలపై స్పీకర్ నిర్ణయం తీసు కోవాలని కోరారు.  

కాళేశ్వరంలో రూ.లక్ష కోట్లా..? రూ.9 వేల కోట్లా..? 

 కాళేశ్వరం ప్రాజెక్టు నిర్మాణంలో రూ.9 వేల కోట్ల స్కామా..? రూ.లక్ష కోట్ల స్కామా..? అని బండి సంజయ్ నిలదీశారు. కాళేశ్వరంలో రూ.లక్ష కోట్ల స్కామ్ జరిగితే .. సీబీఐకి కేవలం రూ.9 వేల కోట్ల స్కామ్ అని ఇచ్చారని తెలిపారు. ఫోన్ ట్యాపింగ్ కేసు టీవీ సీరియల్ ఎపిసోడ్‌లా సాగుతోందన్నారు. బీఆర్‌ఎస్‌పై ప్రజల్లో నమ్మకం లేదని, కాంగ్రెస్ ప్రభుత్వం రెండేళ్లలోనే విశ్వాసం కోల్పోయిందని చెప్పారు. రాబోయే జీహెచ్‌ఎంసీ ఎన్నికల్లో బీజేపీ ఒంటరిగానే పోటీ చేసి మేయర్ పీఠాన్ని దక్కించుకుంటుందని బండి సంజయ్ ధీ మా వ్యక్తం చేశారు. భాగ్యనగరాన్ని మజ్లిస్ పార్టీకి దాదరత్తం చేయడానికి కాంగ్రెస్ పార్టీ ప్లాన్ చేస్తోందన్నారు.

‘మజ్లిస్ ముక్త్ భాగ్యనగర్’ (మజ్లిస్ లేని హైదరాబాద్) తమ లక్ష్యమన్నారు. కేంద్రం నుంచి గ్రామ పంచాయతీలకు రూ.3005 కోట్లు వస్తున్నాయని తెలిపారు. అయితే రాష్ట్ర ప్రభు త్వం ఒక్కో పంచాయతీకి రూ.5 లక్షలు ఇస్తామని చెప్పడం బిచ్చమేసినట్లుగానే ఉందని ఆయన నెద్దేవా చేశారు. సగటును ఒక్కో పంచాయతీకి రూ.కోటి ఇవ్వాలని బండి సంజయ్ డిమాండ్ చేశారు. ఆరు గ్యారెంటీలపై చర్చ జరకుండా సీఎం రేవంత్‌రెడ్డి పక్కదారి పట్టిస్తున్నారని బండి సం జయ్ ఆరోపించారు. కేంద్ర ప్రభుత్వం ఎన్ని ఇండ్లు మంజూరు చేసింది? ఎంత మందికి ఇందిరమ్మ ఇండ్లు నిర్మించి ఇచ్చారో వివరాలు చెప్పాలన్నారు.