11 May, 2026 | 3:40 AM

రేపు ఎర్రవల్లిలో కేసీఆర్ కీలక సమావేశం

11-05-2026 01:44 AM

పార్టీ సంస్థాగత బలోపేతం, ఇతర అంశాలపై చర్చ

హైదరాబాద్, మే 10(విజయక్రాంతి): బీఆర్‌ఎస్ పార్టీ సంస్థాగత బలోపేతంపై కీలక సమావేశం నిర్వహించనుంది. మంగళవారం మధ్యాహ్నం 2 గంటలకు ఎర్రవల్లిలోని నివాసంలో పార్టీ అధినేత కేసీఆర్ అధ్యక్షతన సమావేశం జరగనుంది.

ఈ సమావేశంలో పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్‌తో పాటు ప్రధాన కార్యదర్శులు, శాసన సభాపక్షం, మండలిపక్షాల ఉపనా యకులు పాల్గొననున్నారు. పార్టీ సంస్థాగత నిర్మాణం, సభ్యత్వ నమోదు, ఇన్‌చార్జుల నియామకం తదితర ముఖ్య అంశాలపై సమావేశంలో విస్తృతంగా చర్చించనున్నట్లు సమాచారం. రాష్ట్ర రాజకీయ పరిణామాల నేపథ్యంలో పార్టీని క్షేత్రస్థాయిలో మరింత బలోపేతం చేసే దిశగా ఈ సమావేశం కీలకంగా మారనుందని పార్టీ వర్గాలు భావిస్తున్నాయి.