10 May, 2026 | 5:09 PM

హెచ్ఐసీసీ చేరుకున్న ప్రధాని మోదీ

10-05-2026 03:57 PM

హైదరాబాద్: దేశ ప్రధానమంత్రి నరేంద్ర మోదీ బేగంపేట విమానాశ్రయానికి చేరుకున్నారు. ప్రధాని మోదీకి రాష్ట్ర ప్రభుత్వం తరపున గవర్నర్ శివ ప్రతాప్ శుక్లా, ఉపముఖ్యమంత్రి భట్టి విక్రమార్క ఘన స్వాగతం పలికారు. అనంతరం మోదీ బేగంపేట నుంచి గచ్చిబౌలిలోని హెచ్ఐసీ సెంటర్ లో నిర్వహించిన కార్యక్రమానికి చేరుకున్నారు. హెచ్ఐసీసీ నుంచి రూ.9,377 కోట్లతో చేపట్టనున్న వర్చువల్ గా పలు అభివృద్ధి పనులకు ప్రారంభోత్సం, శంకుస్థాపన చేసి జాతికి అంకితం చేయనున్నారు. హెచ్ఐసీసీలో ప్రధాని మోదీని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కలిసి సత్కరించారు. అనంతరం కేంద్రమంత్రి కిషన్ రెడ్డి మోదీకి కండువాతో సత్కరించి, శ్రీరాముడి విగ్రహాన్ని అందజేశారు.