4 April, 2026 | 8:59 PM

Breaking News

మల్లారెడ్డి కాలేజ్ ఆఫ్ ఫార్మసీలో ప్లేస్మెంట్ డ్రైవ్   •   పోమాల్ ఉన్నత పాఠశాలను సందర్శించిన ఆర్జేడీ సోమిరెడ్డి   •   అద్దంకి దయాకర్ జన్మదిన వేడుకలు   •   మరోసారి ఔదార్యం చాటుకున్న తాళ్లూరి పంచాక్షరయ్య చారిటబుల్ ట్రస్ట్   •   గజ్వేల్ క్యాంప్ కార్యాలయంపై దాడిని ఖండించిన హరిప్రియ నాయక్   •   లయన్స్ క్లబ్ సేవలు ప్రశంసనీయం   •   అర్బన్ కాలనీ అంగన్వాడి కేంద్రాలకు ప్రత్యేక కమిటీ ఏర్పాటు   •   పేద మధ్యతరగతి ప్రజలపై ధరల భారం పెరుగుతోంది: సిపిఎం   •   పేదల జీవితాలలో వెలుగులు నింపడమే కాంగ్రెస్ ప్రజా ప్రభుత్వ ధ్యేయం   •   సింగరేణిలో రాజకీయ జోక్యం వల్ల గనుల ప్రారంభం ఆలస్యం   •  

ఎంపీ ఎన్నికల సన్నాహక సమావేశం

02-05-2024 01:48 AM

పాల్గొన్న కార్మిక సంఘాలు, ఐఎన్‌టీయూసీ 

పటాన్ చెరు, మే 1: మేడే సందర్భంగా రామచంద్రాపురంలో ఉమ్మడి మెదక్ కార్మిక సంఘాల, ఐఎన్‌టీయూసీ ఆధ్వర్యంలో ఎంపీ ఎన్నికల సన్నాహక సమావేశం జరిగింది. మెదక్ కాంగ్రెస్ ఎంపీ అభ్యర్థి నీలం మధుకు మద్దతుగా శ్రీ కన్వెన్షన్ హాల్ లో బుధవారం సమావేశాన్ని నిర్వహించారు. ఈ సమావేశానికి ముఖ్య అతిథులుగా డీసీసీ అధ్యక్షురాలు నిర్మలజగ్గారెడ్డి, పటాన్‌చెరు నియోజకవర్గ ఇన్‌ఛార్జి కాట శ్రీనివాస్‌గౌడ్, ఎంపీ అభ్యర్థి నీలం మధు హాజరయ్యారు. ఈ సందర్భంగా నిర్మల జగ్గారెడ్డి మాట్లాడుతూ మెదక్ ఎంపీ అభ్యర్థిగా పోటీ చేస్తున్న నీలం మధును భారీ మెజార్టీతో గెలిపించాలని కోరారు. అనంతరం కాట శ్రీ నివాస్‌గౌడ్ మాట్లాడుతూ మెదక్ ఎంపీగా ఇందిరాగాంధీ ఉన్న సమయంలో బీడీఎల్, బీహెచ్‌ఈఎల్, ఓడీఎఫ్ లాంటి పరిశ్రమలను తీసుకొచ్చి కార్మికులకు ఉపాధి కల్పించారని గుర్తు చేశారు. ప్రజలకు మేలు చేసే పార్టీ కాంగ్రెస్ ఒక్కటే అని ఎంపీ అభ్యర్థి నీలం మధు తెలిపా రు. అనంతరం జిన్నారం మండలం నల్తూరు మాజీ సర్పంచ్ పెంటయ్య కాంగ్రెస్‌లో చేరారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ నాయకులు, కార్మిక నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.