13 August, 2026 | 2:44 AM

కబ్జాలపై కన్నేయండి!

13-08-2026 01:17 AM
  1. సర్కార్ భూముల అక్రమాలపై కొరడా ఝులిపించండి
  2. హెచ్చరిక బోర్డును లెక్కచేయని అక్రమార్కులు
  3. ముత్తారం మండలం శాత్రాజ్ పల్లిలో 21.26 ఎకరాలు ఆక్రమణ
  4. కలెక్టర్ కు మాజీ జెడ్పీటీసీ నాగినేని ఫిర్యాదు

ముత్తారం, ఆగస్టు 12 (విజయక్రాంతి) ప్ర భుత్వ భూముల పరిరక్షణలో రెవెన్యూ అధికారుల నిర్లక్ష్యంపై విమర్శలు వెల్లువెత్తుతు న్నాయి. ముత్తారం మండలం శాత్రాజ్పల్లి గ్రామంలోని సర్వే నంబర్ 181లో ప్రభుత్వ భూమిని ఆక్రమించి యథేచ్ఛగా వినియోగిస్తున్న వ్యవహారం తాజాగా రెవెన్యూ విచా రణలో వెలుగులోకి వచ్చింది. మొత్తం 708. 26 ఎకరాల విస్తీర్ణం ఉన్న ఈ సర్వే నంబర్లో 21.26 ఎకరాల ప్రభుత్వ భూమిని కాసగోని రవి ఆక్రమించినట్లు మండల గిర్దావర్, మండల సర్వేయర్ క్షేత్రస్థాయి పరిశీలనలో గుర్తించినట్లు తహసీల్దార్ నివేదికలో పేర్కొన్నారు.

హెచ్చరిక బోర్డులున్నా.. ఆక్రమణ ఆగలేదు!

ప్రభుత్వ భూమి అని హెచ్చరిక బోర్డులు ఏర్పాటు చేసినప్పటికీ వాటిని ఏమాత్రం లె క్కచేయకుండా ఆక్రమణలు కొనసాగుతున్నాయని ఆరోపణలు ఉన్నాయి. అంతేకాకుండా గత వేసవిలో ఉపాధి హామీ పథకం కింద ప్రభుత్వ నిధులతో వేసిన రో డ్డును సైతం ఆక్రమణదారులు దున్ని తమ భూమిలో కలుపుకున్నారనే ఆరోపణలు తీవ్ర చర్చనీయాంశంగా మారాయి. ప్రభుత్వ ఆస్తులను కాపాడాల్సిన అధికారులు కళ్లముందే ఆక్రమణలు జరుగుతున్నా ఎందు కు అడ్డుకోలేదనే ప్రశ్నలు స్థానికుల నుంచి వినిపిస్తున్నాయి.

పౌల్ట్రీ ఫారం.. మామిడి తోట.. వరి సాగు

రెవెన్యూ అధికారుల క్షేత్రస్థాయి విచారణలో ప్రభుత్వ భూమిలో పౌల్ట్రీ ఫారం ఏర్పాటు చేయడంతో పాటు మామిడి చెట్లు పెంచుతున్నట్లు, వరి సాగు చేస్తున్నట్లు గుర్తించినట్లు నివేదికలో పేర్కొన్నారు. ప్రభుత్వ భూమిని ప్రైవేటు అవసరాలకు వినియోగిస్తున్నట్లు అధికారులు నమోదు చేయడం ఈ వ్యవహారం తీవ్రతను తెలియజేస్తోంది.

ఫిర్యాదుతో కదిలిన రెవెన్యూ యంత్రాంగం

నాగినేని జగన్మోహన్రావు ఇచ్చిన ఫిర్యా దు మేరకు జిల్లా కలెక్టర్ ఆదేశాలతో రెవె న్యూ అధికారులు విచారణ చేపట్టారు. స్థల పరిశీలన, సర్వే అనంతరం ప్రభుత్వ భూమి ఆక్రమణకు సంబంధించిన వివరాలను నివేదికలో పొందుపరిచారు. అనంతరం ముత్తా రం తహసీల్దార్ పోలీసులకు లేఖ రాసి నిబంధనల ప్రకారం చర్యలు తీసుకోవాలని కోరినట్లు అధికారిక పత్రాల్లో ఉంది.

అధికారుల నిర్లక్ష్యంతోనే కబ్జాలు

ప్రభుత్వ భూములను పరిరక్షించాల్సిన రెవెన్యూ అధికారులు ముందస్తు చర్యలు తీసుకోకపోవడం వల్లే ఆక్రమణదారులకు ధైర్యం వస్తోందని మాజీ జెడ్పీటీసీ నాగినేని జగన్మోహన్రావు మండిపడ్డారు. హెచ్చరిక బోర్డులు ఏర్పాటు చేసినా వాటిని ధిక్కరించి ప్రభుత్వ భూమిని ఆక్రమించడం, ప్రభుత్వ నిధులతో వేసిన ఉపాధి హామీ రోడ్డును సై తం దున్నేయడం తీవ్రమైన విషయమన్నా రు. ప్రభుత్వ భూమిని కాపాడటంలో విఫలమైన అధికారుల నిర్లక్ష్యంపైనా సమగ్ర వి చారణ జరపాలని ఆయన డిమాండ్ చేశా రు.

హైకోర్టును ఆశ్రయించిన మాజీ జెడ్పీటీసీ

ఈ వ్యవహారంపై నాగినేని జగన్మోహన్రా వు హైకోర్టును కూడా ఆశ్రయించారు. అం దుబాటులో ఉన్న కేసు వివరాల ప్రకారం డబ్ల్యూపీ నం. 38273/2026, సీఆర్‌ఎన్ నంబర్ హెచ్బీహెచ్సీ 0105305 42026 గా, ‘నాగినేని వర్సెస్ స్టేట్’ పేరుతో కేసు దాఖలైనట్లు తెలుస్తోంది. ఈ నేపథ్యంలో రెవెన్యూ విచారణ నివేదిక, పోలీసులకు పంపిన తహసీల్దార్ లేఖ ప్రాధాన్యం సంతరించుకున్నాయి.

కలెక్టర్ స్పందించాలి

శాత్రాజ్పల్లిలో ప్రభుత్వ భూమి ఆక్రమణపై జిల్లా కలెక్టర్ కోయ శ్రీహర్ష ప్రత్యేకంగా దృష్టిసారించి ఆక్రమిత భూమిని స్వాధీనం చేసుకోవడంతో పాటు ప్రభుత్వ రోడ్డును తిరిగి రక్షించాలి, ఆక్రమణకు పాల్పడిన వారి పై చట్టపరమైన చర్యలు తీసుకోవాలని స్థానికులు కోరుతున్నారు. అదే సమయంలో ప్ర భుత్వ భూమి ఆక్రమణ జరుగుతున్న సమయంలో అధికారులు ఎందుకు అడ్డుకోలే క పోయారనే అంశంపైనా విచారణ జరపాల ని డిమాండ్ చేస్తున్నారు. ప్రభుత్వ ఆస్తులను కాపాడాల్సిన బాధ్యత ఉన్న అధికారుల నిర్లక్ష్యంపై కలెక్టర్ ఏ మేరకు స్పందిస్తారో వేచి చూడాలి.