03-11-2025 02:23:16 PM
మున్సిపల్ కమిషనర్ గజానంద్
కుమ్రంభీం ఆసిఫాబాద్,(విజయక్రాంతి): పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుకోవాలని మున్సిపల్ కమిషనర్ గజానంద్ అన్నారు. సోమవారం పట్టణంలోని పోలీస్ హెడ్ క్వార్టర్ వెనుకల గల ఆంజనేయస్వామి ఆలయం, బజార్ వాడి ప్రాంతంలో జరుగుతున్న పారిశుద్ధ పనులను పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ... పారిశుధ్యానికి సంబంధించిన సమస్యలు ఉంటే ఇంచార్జ్ సానిటరీ ఇన్స్పెక్టర్ రామయ్య 9177457040ను సంప్రదించాలని తెలిపారు. ఇంటి పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుకోవడంలో ప్రజలు స్వచ్ఛందంగా భాగస్వామ్యం కావాలని కోరారు. ఆయన వెంట సానిటరీ ఇన్స్పెక్టర్ ,మున్సిపల్ సిబ్బంది పాల్గొన్నారు.