03-11-2025 02:05:51 PM
ఎమ్మెల్యే యెన్నం శ్రీనివాస్ రెడ్డి
మహబూబ్ నగర్,(విజయక్రాంతి): రంగారెడ్డి జిల్లా చేవెళ్ల మండలంలోని మీర్జాగూడ వద్ద జరిగిన ఆర్టీసీ బస్సు ప్రమాదంపై తీవ్ర దిగ్భ్రాంతి ఎమ్మెల్యే యెన్నం శ్రీనివాస్ రెడ్డి వ్యక్తం చేశారు. మీర్జాగూడ వద్ద హైదరాబాద్–బీజాపూర్ జాతీయ రహదారిపై తాండూరు డిపోకు చెందిన ఆర్టీసీ బస్సు ప్రమాదంతో 21 మంది మరణించడం ఎంతో ఆవేదనకు గురి చేసిందన్నారు.ఈ ప్రమాదంలో ప్రయాణికులు మృతి చెందడం పట్ల ప్రగాఢ సానుభూతి వ్యక్తం చేశారు. ప్రయాణాలు ప్రతి ఒక్కరు అవసరమైన జాగ్రత్తలు తీసుకుంటూ ముందుకు సాగాలని సూచించారు. ఈ ఘటన జరగడం దురదృష్టకరమని ఆవేదన వ్యక్తం చేశారు. మృతుల కుటుంబ సభ్యులకు ధైర్యాన్ని ప్రసాదించాలని భగవంతుని ప్రార్థిస్తున్నట్లు పేర్కొన్నారు.