నర్సింగాపూర్‌లో కేంద్రీయ విద్యాలయం
- జగిత్యాలను ఎడ్యుకేషన్ హబ్‌గా మార్చడమే లక్ష్యం..
- రాష్ట్ర సాంఘీక సంక్షేమ శాఖ మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమార్
జగిత్యాల, మే 26 ( విజయక్రాంతి ) :జగిత్యాలకు మంజూరైన కేంద్రీయ విద్యాలయా నికి నర్సింగాపూర్ శివారులోని సర్వే నెంబర్ 437లో స్థలం కేటాయించినట్లు రాష్ట్ర సాం ఘీక సంక్షేమ శాఖ మంత్రి లక్ష్మణ్ కుమార్ తెలిపారు. మంగళవారం జగిత్యాల జిల్లా కలెక్టర్ సత్య ప్రసాద్,ఎమ్మెల్యే డాక్టర్ సంజ య్ కుమార్ లతో కలిసి నర్సింగాపూర్ లోని కేంద్రీయ విద్యాలయానికి కేటాయించే తలపెట్టిన స్థలాన్ని పరిశీలించారు. ఈ సంద ర్భంగా మంత్రి అడ్లూరి మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం విద్యాకు ప్రథమ ప్రాధాన్యం ఇస్తుందని అన్నారు.
ఇందులో భాగంగా ప్రతి నియోజకవర్గానికి ఇన్ ఇండియా ఇంటిగ్రేటెడ్ స్కూల్ నిర్మాణం చేయాలని ముఖ్య మంత్రి రేవంత్ రెడ్డి ఆలోచన చేసి ముం దుకు సాగుతున్నారని తెలిపారు.జగిత్యాలకు మంజూరైన కేంద్రీయ విద్యాలయాన్ని నర్సింగాపూర్ గ్రామంలో ఏర్పాటు చేయాలని నిర్ణయించినట్లు తెలిపారు. ఇందుకోసం 6 ఎకరాల స్థలాన్ని సర్వే నెంబర్ 437లో కేటాయిస్తున్నట్లు వివరించారు. ఇప్పటికే రూ. 33 కోట్లతో ఐటిఐ, ఈ ఏటీసీ సెంటర్ ను ఇక్కడ ఏర్పాటు చేశామని వృద్ధ ఆశ్ర మం సైతం ఇక్కడే ఏర్పాటు చేస్తున్నట్లు తెలిపారు.
కేంద్రీయ విద్యాలయం ఏర్పాటుతో ఈ ప్రాంతం ఎడ్యుకేషన్ హబ్ గా మారుతుందని అన్నారు.చల్ గల్ లోని వ్యవసా య పరిశోధనకు సంబంధించిన వాలంతరీ భూములను 12 ఎకరాలు కేంద్రీయ విద్యాలయానికి, ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ స్కూల్ కి కేటాయించడం జరిగిందని వివరించారు.కేంద్రీయ విద్యాలయానికి రెండు ఎకరాల స్థలం సరిపోదని వివాదం నేపథ్యంలో నర్సింగాపూర్ లో ప్రభుత్వ భూమి కేటాయిస్తున్నట్లు మంత్రి తెలిపారు.
రాష్ట్ర రైతుల ప్రయోజనాల కోసం చల్ గల్ మరి న్ని వ్యవసాయ పరిశోధనలు జరగాల్సిన నేపథ్యంలో వ్యవసాయ పరిశోధనల భవిష్యత్తు అవసరాల కోసం అక్కడి భూము లను అంతకు మించి కేటాయించే అవకాశం లేదని అన్నారు.నర్సింగాపూర్ భూముల ప్రతిపాదనలు జిల్లా అధికారుల ద్వారా కేంద్రీయ విద్యాలయ అధికారులకు ప్రతిపాదనలు పంపించడం జరుగుతుందని ఎందు కు నిజామాబాద్ ఎంపీ అరవింద్ విద్యార్థుల భవిష్యత్తును దృష్టిలో ఉంచుకొని సహకరించాలని మంత్రి కోరారు.






