13 July, 2026 | 7:58 AM

ప్రభుత్వ సలహాదారుగా కేకే.. కేబినెట్‌ హోదా కల్పించిన కాంగ్రెస్‌

06-07-2024 03:32 PM

హైదరాబాద్: భారత రాష్ట్ర సమితి (బిఆర్‌ఎస్) నుండి కాంగ్రెస్‌లోకి ఫిరాయించిన రాజ్యసభ మాజీ ఎంపీ కె. కేశవరావు తెలంగాణ ప్రభుత్వ సలహాదారు (ప్రజా వ్యవహారాల)గా కేబినెట్ మంత్రి హోదాలో నియమితులయ్యా రు. ఈ మేరకు ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతికుమారి శనివారం ఉత్తర్వులు జారీ చేశారు. కేశవరావు తన రాజ్యసభ ఎంపీ పదవికి రాజీనామా చేసి గురువారం రాజ్యసభ చైర్‌పర్సన్ జగదీష్ ధన్ఖడ్ కు సమర్పించారు. శుక్రవారం ఆయన రాజీనామాను ఆమోదించారు. తెలంగాణ ప్రభుత్వ సలహాదారుగా కేశవరావును నియమిస్తున్నట్లు ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి ఈ వారం తొలినాళ్లలో ఢిల్లీ పర్యటనలో వెల్లడించారు. ఈ మేరకు శనివారం ఉత్తర్వులు జారీ చేసింది.