టేకులపల్లి మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడుగా లక్కినేని శ్యామ్ నియామకం
14-05-2026 04:33 PM
టేకులపల్లి, (విజయక్రాంతి): ఇల్లందు నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీని బలోపేతం చేయడంలో భాగంగా టేకులపల్లి మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడుగా లక్కినేని శ్యామ్ నీ నియమిస్తు తెలంగాణ పిసిసి అధ్యక్షుడు జారీ చేసిన ఉత్తర్వులను, జిల్లా అధ్యక్షురాలు తోట లక్ష్మీ ప్రసన్న ద్వారా నియామకపు ఉత్తర్వులు అందాయి. నూతన మండల అధ్యక్షుడు ఎన్నికై నటువంటి లక్కినేని శ్యామ్ మాట్లాడుతూ.. జిల్లా అధ్యక్షులకు, నియోజకవర్గ ఎమ్మెల్యే కోరం కనకయ్య కి, ఎంపీ బలరామ్ నాయక్, మంత్రుల కి, సహచర నియోజకవర్గ నాయకులకి కృతజ్ఞతలు తెలిపారు.






