15 April, 2026 | 12:56 PM

Breaking News

మహిళలంటే రేవంత్ రెడ్డికి ఎందుకు వివక్ష?.. సీఎంకు ఎంపీ లక్ష్మణ్ కౌంటర్   •   ఎంపీ అశోక్ మిట్టల్‌ వ్యాపార సంస్థలపై ఈడీ దాడులు   •   బీహార్ రాజకీయాల్లో చారిత్రక ఘట్టం... సీఎంగా సామ్రాట్‌ చౌదరి   •   రేవంత్‌ రెడ్డితో పీసీసీ చీఫ్, మీనాక్షి నటరాజన్ భేటీ   •   తెలంగాణ పర్యాటక రంగాన్ని బలోపేతం చేస్తాం: మంత్రి జూపల్లి   •   ఛత్తీస్‌గఢ్‌లో భారీ పేలుడు: 14కు చేరిన మృతుల సంఖ్య.. న్యాయవిచారణకు కాంగ్రెస్ డిమాండ్   •   AP Inter Results 2026: ఏపీ ఇంటర్ ఫలితాలు విడుదల   •   పంజాబ్‌లో బస్సు బోల్తా: ఆరుగురు యాత్రికులు మృతి   •   దక్షిణాదిలో ప్రజాఉద్యమం తప్పదు.. కేంద్ర ప్రభుత్వానికి KTR హెచ్చరిక   •   సంక్షేమ- అభివృద్ధి సమన్వయమే ప్రభుత్వ ధ్యేయం: మంత్రి పొంగులేటి   •  

ఖబర్దార్.. పుట్టమధు నోరు అదుపులో పెట్టుకో..

14-06-2025 12:06 AM

మంథని లో విలేకరుల సమావేశంలో కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షుడు ఐలి ప్రసాద్

మంథని జూన్ 13(విజయ క్రాంతి) ఖబర్దార్ పుట్ట మధు నోరు అదుపులో పెట్టుకో అని కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షుడు ఐలి ప్రసాద్ హెచ్చరించారు. ఐంది ప్రసాద్ ఆధ్వర్యంలో ఎమ్మెల్యే క్యాంప్ ఆఫీస్ లో శనివారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో మాజీ సర్పంచ్ వోడ్నాల శ్రీనివాస్, పి ఎసిఎస్ చైర్మన్ కొత్త శ్రీనివాస్, వర్కింగ్ ప్రెసిడెంట్ బూడిద శంకర్, నాయకులు శశిభూషణ్ కాచే,మాజీ యూత్ అధ్యక్షు లు ఎరుకల ప్రవీణ్, మాజీ ఎంపిటిసి మారగొని శంకర్ గౌడ్, శ్రీపతి బానయ్య, అజీమ్ ఖాన్, నర్సింగరావు మాట్లాడుతూ మాజీ జెడ్పీ చైర్మన్ పుట్ట మధు చేసిన ఆరోపణలు కాంగ్రెస్ పార్టీ నాయకులు తీవ్రంగా ఖండించారు.

మంథని నియోజకవర్గాన్ని మంత్రి సర్వతోముఖాభివృద్ధి చేస్తా ఉంటే చూసి ఓర్వ లేక ఆయన ఆరోపణలు చేస్తా ఉన్నారని శ్రీను బాబు శ్రీధర్ బాబు కు చేదోడు వాదోడుగా ఉంటూ ఈ ప్రాంత ప్రజల క ష్టాలను తీరుస్తూ నిత్యం ప్రజలకు అందుబాటులో ఉంటూ ఒక్క ఫోన్ తోటే ప్రజా సమస్యలు పరిష్కరిస్తూ పార్టీ కార్యకర్తలకు అండగా ఉంటూ పార్టీ కార్యక్రమాలను విజయవంతం చేస్తూ కార్యకర్తల్ని ఉత్సాహపరుస్తూ పార్టీ బలోపేతానికి కృషి చేస్తా ఉంటే కాంగ్రెస్ పార్టీ అధిష్టానం గుర్తించి వారికి తెలంగాణ ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ ప్రధాన కార్యదర్శిగా వారికి అవకాశం ఇచ్చారని,ఇది మా పార్టీ అంతర్గత వ్యవహారమని, దా నిపైన కూడా నువ్వు రాజకీయం చేయడం సిగ్గుచేటన్నారు.

నీ సతీమణి పుట్ట శైలజ మంథని సర్పంచ్ గా, నువ్వు మంథని ఎమ్మెల్యేగా నీ భార్య శైలజ మున్సిపల్ చైర్మన్ గా నువ్వు జడ్పీ చైర్మన్ గా ఉన్నారని మర్చిపోయారా ఆనాడు మంథని సర్పం చ్ గా మున్సిపల్ చైర్మన్ గా ఇతర ఎస్సీ ఎస్టీ బీసీకి ఎందుకు పదవులు ఇవ్వలేదని మధు ను ప్రశ్నించారు.ఆనాడు కాళేశ్వరం ముక్తేశ్వర దేవాలయ చైర్మన్ గా ఓసి సామాజిక వర్గానికి చెందిన వారికి ఇవ్వడం జరిగిందని, స్థానికేతరుడు కేసీఆర్ చు ట్టానికి కాలేశ్వరం ముక్తేశ్వర దేవస్తాన చైర్మన్ ఇస్తే ఆనాడు నువ్వెందుకు ప్రశ్నించలేదని ప్రశ్నించారు. 

ఇక్కడున్న ఎస్సీ ఎస్టీ బీసీలకు ఎందుకు కాలేశ్వరం ముక్తేశ్వర దేవస్థానం చైర్మన్ పదవి ఇప్పించలేదని నిలదీశారు. ఎంతోమంది ఎస్సీ, ఎస్టీ బీసీలను అణగదొక్కి వారిపై దాడు లు చేసి ఈరోజు నువ్వు ఈ స్థాయికి వచ్చావని, నువ్వు మాట్లాడుతుంటే దయ్యాలు వేదాలు వల్లించినట్లు ఉందని,ఈ ప్రాం తంలో ఉన్న ఎస్సీ ఎస్టీ బీసీలకు అన్ని వర్గాల ప్రజలకు నాయకులకు సముచిత స్థానం కల్పిస్తున్నారని,ఇది పూర్తిగా మా పార్టీ వ్యవహారమని, ముందు నీ పార్టీ కార్యకర్తలు నీ నాయకత్వం నచ్చక శ్రీధర్ బాబు నాయకత్వంలో పనిచేయడానికి కాంగ్రెస్ పార్టీలో చేరుతున్నారని,ముందు నీ పార్టీ వ్యవహారా లు చక్కదిద్దుకోవాలని హితవు పలికారు. మరోసారి మంత్రి శ్రీధర్ బాబు ౠశ్రీను బాబు గురించి మాట్లాడితే మా కాం గ్రెస్ నాయకులు ఊరుకోరని హెచ్చరించారు.

ఈ కార్యక్రమం లో మున్సిపల్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు పోలు శివ, మండల యూత్ అధ్యక్షుడు సాదుల శ్రీకాంత్, సింగిల్ విండో డైరెక్టర్ రావికంటి సతీష్, జిల్లా ప్రధాన కార్యదర్శి కూడుదుల వెంకన్న, మాజీ కౌన్సిలర్లు శ్రీపతి బానయ్య, వీకే రవి, నూకల బాన య్య, కూర లింగయ్య, కాంగ్రెస్ నాయకులు పేరవేన లింగ య్య, రామ్ రాజశేఖర్, చంద్రు రాయమల్లు, అక్కపాక సద య్య, సందీప్ మాజీ సర్పంచులు బి శ్రీనివాస్, ఎస్సీ సెల్ మండల అధ్యక్షుడు మంథని రాకేష్, బీసీ సెల్ మండల అధ్యక్షుడు ఐలి శ్రీనివాస్, జిల్లా సోషల్ మీడియా ఇన్చార్జి ఆరెల్లి కిరణ్, యూత్ కాంగ్రెస్ నాయకులు ఆర్ల నాగరాజు, ఆరెల్లి వరుణ్, క్రాంతి కుమార్, పెండ్రు విజయ్, రోడ్డ రాజేశ్వర్ రావు, ఊట్ల అనిల్, భూగొండ రవి కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.