17 April, 2026 | 3:16 PM

Breaking News

ఫిల్మ్‌నగర్‌లో ఆయమ్మ దాష్టీకం.. గుడ్డు అడిగినందుకు విద్యార్థిపై గరిటెతో దాడి   •   తెలంగాణ ఉద్యమాన్ని కించపర్చింది రేవంత్ రెడ్డి కాదా?   •   డీలిమిటేషన్ 'డీమోనిటైజేషన్' లాంటిదే: శశిథరూర్   •   తేజస్వీ సూర్య వ్యాఖ్యలను తీవ్రంగా ఖండించిన మాజీ ఎంపీ నామ   •   కాళేశ్వరంలో జరిగిన పొరపాట్లు.. తెలంగాణ ప్రజలకు తెలుసు   •   ఉద్యోగుల సమస్యల పరిష్కారానికి తంగళ్ళపల్లిలో వినతి పత్రాల కార్యక్రమం   •   25 క్వింటాళ్ల రేషన్ బియ్యం సీజ్   •   హుజూర్ నగర్ సీనియర్ సివిల్ జడ్జిగా శ్యామ సుందర్   •   విద్యార్థిని మృతి... ప్రభుత్వంపై తెలంగాణ బీసీ సంక్షేమ సంఘంతీవ్ర విమర్శలు   •   మాణిక్ గూడ గ్రామ సంరక్షణకు చర్యలు   •  

సంజీవిని ఆంజనేయస్వామి కృపా కటాక్షాలతో ప్రజలంతా సంతోషంగా ఉండాలి

14-06-2025 12:06 AM

కుత్బుల్లాపూర్,(విజయక్రాంతి): సంజీవిని ఆంజనేయస్వామి కృపా కటాక్షాలతో ప్రజలంతా సంతోషంగా ఉండాలని బిఆర్ఎస్ పార్టీ విప్, ఎమ్మెల్యే కెపి.వివేకానంద్ అన్నారు. కుత్బుల్లాపూర్ నియోజకవర్గం కొంపల్లి మున్సిపాలిటీ పరిధి జయభేరి పార్క్ కాలనీలోని శ్రీ సీతారామ సంజీవని అంజనేయస్వామి దేవాలయంలో శ్రీ ఆంజనేయ స్వామి వారిని ప్రతిష్టించి శుక్రవారంతో మండలం పూర్తవుతున్న సందర్భంగా నిర్వహించిన అభిషేక, హోమ కార్యక్రమానికి బిఆర్ఎస్ పార్టీ విప్, ఎమ్మెల్యే కెపి.వివేకానంద్ ముఖ్యఅతిథిగా హాజరై అంజనీపుత్ర హనుమాన్ కి ప్రత్యేక పూజలు నిర్వహించారు.

ఈ సందర్భంగా ఎమ్మెల్యే కెపి.వివేకానంద్ మాట్లాడుతూ... అంజనీ సుతుడు అయిన ఆంజనేయుడు లక్ష్మణుడిని కాపాడేందుకు సంజీవని తీసుకొచ్చాడని, అంతటి పరాక్రమవంతుడైన ఆంజనేయుడు తిరిగి జయభేరి నందు సంజీవని ఆంజనేయుడిగా ప్రతిష్టించబడ్డాడని, స్వామివారి దయతో ప్రజలంతా ఆయురారోగ్యాలు, అష్టైశ్వర్యాలతో జీవించాలన్నారు. ఈ కార్యక్రమంలో కొంపల్లి మున్సిపాలిటీ మాజీ చైర్మన్ సన్న శ్రీశైలం యాదవ్, బిఆర్ఎస్ పార్టీ అధ్యక్షులు ప్రభాకర్ రెడ్డి, ఆలయ కమిటీ సభ్యులు వాసుదేవా రెడ్డి, జీవన్ రెడ్డి, వినోద్ రెడ్డి, మధుసూదన్ రెడ్డి, నరసింహారెడ్డి,  రవీందర్ రెడ్డి,  మహిపాల్ రెడ్డి, బాగా రెడ్డి, మన్మోహన్ పాండే, సుభాష్, సీతారామరాజు, పిఎస్ఎన్ రాజు, శేఖర్ రెడ్డి, గిరి, శ్రీధర్ రెడ్డి, కాలనీ వాసులు తదితరులు పాల్గొన్నారు.