calender_icon.png 27 June, 2025 | 3:12 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

జిల్లా ఎస్పీని కలిసిన ఖానాపూర్ ఇంటిగ్రేటెడ్ స్కూల్ సాధన కమిటీ జేఏసీ

26-06-2025 09:54:53 PM

ఖానాపూర్ (విజయక్రాంతి): నిర్మల్ జిల్లా(Nirmal District) ఖానాపూర్ నియోజకవర్గంలో ఇటీవల ఇంటిగ్రేటెడ్ స్కూల్ నిర్మాణం విషయంలో ప్రజల్లో తీవ్ర చర్చ జరుగుతున్న నేపథ్యంలో కాంగ్రెస్ పార్టీ నిర్ణయానికి వ్యతిరేకంగా ఖానాపూర్, పెంబి, దస్తురాబాద్, కడం, మండలాల నుంచి ఇంటిగ్రేటెడ్ పాఠశాల సాధన కమిటీ జేఏసీ ఏర్పాటు అయిన విషయం తెలిసిందే. కాగా జేఏసీ ఆధ్వర్యంలో సాధన కమిటీ రిలే నిరాహార దీక్షలు ఏర్పాటు కోసం అనుమతి కోరేందుకు గురువారం జిల్లా ఎస్పీని కలిశారు. ఈ మేరకు అనుమతి కావాలంటూ జిల్లా ఎస్పీ, ఏఎస్పిలకు దరఖాస్తు చేశారు. ఈ కార్యక్రమంలో జేఏసీ గౌరవాధ్యక్షులు సాగి లక్ష్మణరావు, కన్వీనర్ నందిరామయ్య, ప్రధాన కార్యదర్శి కాశవేని ప్రణయ్ కుమార్, ముఖ్య సలహాదారులు తోట సుమిత్, గౌరీకర్ రాజు, రాపల్లి రవీందర్, తదితరులు ఉన్నారు.