22-07-2025 12:00:00 AM
కామారెడ్డి, జూలై 21 (విజయ క్రాంతి), కామారెడ్డి జిల్లా కేంద్రంలో ఏఐసీసీ అధ్యక్షుడు మల్లికార్జున్ ఖర్గే జన్మదిన వేడుకలను ఘనంగా నిర్వహించారు. టిపిసిసి ప్రధాన కార్యదర్శి గడ్డం చంద్రశేఖర్ రెడ్డి తన అనుచరులతో తన పార్టీ కార్యాలయం లో కేక్ కట్ చేసి కార్గే జన్మదిన వేడుకలను నిర్వహించారు.
సి డి సి మాజీ చైర్మన్ కారంగుల అశోక్ రెడ్డి ఆధ్వర్యంలో జిల్లా కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో ఏ ఐ సి సి అధ్యక్షుడు మల్లికార్జున్ కార్గే జన్మదిన వేడుకలను కేక్ కట్ చేసి ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో పట్టణ కాంగ్రెస్ అధ్యక్షుడు పండ్లరాజు, మాజీ కౌన్సిలర్ జమీల్, గంగాధర్, తదితరులు పాల్గొన్నారు.