22-07-2025 12:00:00 AM
గాంధారి మార్కెట్ కమిటీ చైర్మన్ పరమేశ్వర్
కామారెడ్డి, జూలై 21 (విజయ క్రాంతి), పేదలకు రేషన్ కార్డు ఇచ్చిన చరిత్ర కాంగ్రెస్ ప్రభుత్వాన్ని దేనిని గాంధారి మార్కెట్ కమిటీ చైర్మన్ బండారి పరమేశ్వర్ అన్నారు. సోమవారం కామారెడ్డి జిల్లా గాంధారి మండలం గండిపేటలో 105 మంది పేదలకు రేషన్ కార్డులు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ గత బిఆర్‌ఎస్ ప్రభుత్వం 10 సంవత్సరాలు పరిపాలించిన ఒకరికి కూడా పేదలకు రేషన్ కార్డు ఇచ్చిన చరిత్ర లేదన్నారు.
గతంలో వైయస్ రాజశేఖర్ రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో ఇచ్చిన రేషన్ కాలనీ తప్ప ప్రస్తుతం రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రిగా పేదలకు రేషన్ కార్డులు పంపిణీ చేస్తున్నారని తెలిపారు. పేదలను ఆదుకునే చరిత్ర కాంగ్రెస్ పార్టీకే ఉందన్నారు. ఇందిరమ్మ ఇల్లు, రేషన్ కార్డు లు ఇచ్చిన చరిత్ర గతంలో కానీ ప్రస్తుతం కూడా కాంగ్రెస్ పార్టీ హాయంలోనే ఇవ్వడం జరుగుతుందన్నారు. ఈ కార్యక్రమంలో గండిపేట్ గ్రామ కాంగ్రెస్ అధ్యక్షుడు ఇట్లా సాయిబాబా, మాజీ ఉపసర్పంచ్ ఇంద్ర గౌడ్, యూత్ కాంగ్రెస్ అధ్యక్షులు ప్రకాష్ ,కాంగ్రెస్ నాయకులు శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు.