23 April, 2026 | 3:27 AM

అడవుల పరిరక్షణతోనే మానవ మనుగడ

23-04-2026 12:43 AM

ములుగు (మహబూబాబాద్) ఏప్రిల్ 22 (విజయక్రాంతి): అడవుల పరిరక్షణతోనే మానవ మనుగడ ఆధారపడి ఉందని, ప్రతి ఒక్కరూ భూమి సమతుల్యతను కాపాడేందుకు మొక్కలు పెంచి, ప్లాస్టిక్ వినియోగాన్ని తగ్గించాలని అటవీ శాఖ అధికారులు పిలుపునిచ్చారు. ప్రపంచ భూ దినోత్సవాన్ని పురస్కరించుకొని ములుగు జిల్లా తాడ్వాయి మండల కేంద్రంలో ర్యాలీ నిర్వహించారు. భూతాపాన్ని తగ్గించడం, అడవుల పరిరక్షణ, పర్యావరణ సమతుల్యత పై అటవీశాఖ అధికారులు అవగాహన ర్యాలీ నిర్వహించారు.