17 April, 2026 | 2:30 PM

Breaking News

తేజస్వీ సూర్య వ్యాఖ్యలను తీవ్రంగా ఖండించిన మాజీ ఎంపీ నామ   •   కాళేశ్వరంలో జరిగిన పొరపాట్లు.. తెలంగాణ ప్రజలకు తెలుసు   •   ఉద్యోగుల సమస్యల పరిష్కారానికి తంగళ్ళపల్లిలో వినతి పత్రాల కార్యక్రమం   •   25 క్వింటాళ్ల రేషన్ బియ్యం సీజ్   •   హుజూర్ నగర్ సీనియర్ సివిల్ జడ్జిగా శ్యామ సుందర్   •   విద్యార్థిని మృతి... ప్రభుత్వంపై తెలంగాణ బీసీ సంక్షేమ సంఘంతీవ్ర విమర్శలు   •   మాణిక్ గూడ గ్రామ సంరక్షణకు చర్యలు   •   సేవ చేయాలనే సంకల్పంతోనే రాజకీయాల్లోకి   •   వేములవాడ సబ్ రిజిస్ట్రార్ కార్యాలయంలో సర్వర్ డౌన్.. నిలిచిపోయిన రిజిస్ట్రేషన్లు   •   శ్రీ భీమేశ్వర స్వామి సేవలో ఐజీపీ రమేష్ నాయుడు   •  

1.7 కిలోల గంజాయి పట్టివేత

26-02-2026 12:00 AM

ముగ్గురు రిమాండ్, ఎన్ఫోర్స్మెంట్ సీఐ ఎ. బాలరాజు 

షాద్నగర్ ఫిబ్రవరి 25 (విజయక్రాంతి): గంజాయిని విక్రయిస్తున్న ముగ్గురిని పట్టుకొని 1.7 కిలోల గంజాయిని స్వాధీనం ఎక్సైజ్ పోలీసులు చేసుకున్నారు. మంగళవారం సాయంత్రం ఎక్సైజ్ పోలీసులు ఫరూక్ నగర్ మండలం చింతగూడ గ్రామ పరిధిలోని శ్రీబాలాజీ పౌల్ట్రీ ఫామ్లో టికెదార్గా పనిచేస్తున్న బీహార్ రాష్ట్రానికి చెందిన ఆత్మ మహతో తన స్వరాష్ట్రం నుంచి గంజాయి తెచ్చి, చిన్న చిన్న ప్యాకెట్లుగా తయారు చేసి బూర్గుల, కాశిరెడ్డిగూడ, చింతగూడ, బాలానగర్, షాద్ నగర్ పరిసర ప్రాంతాల్లోని ఫ్యాక్టరీల్లో పనిచేస్తున్న కార్మికులను లక్ష్యంగా చేసుకుని విక్రయిస్తున్నట్టు సమాచారం అందింది.

పక్కా సమాచారంతో ఉన్నతాధికారుల ఆదేశాల మేరకు రంగారెడ్డి డివిజన్ ఎన్ఫోర్స్మెంట్ బృందం 24 ఫిబ్రవరి సాయంత్రం దాడులు నిర్వహించింది. ఈ సందర్భంగా ఆత్మ మహతోను అదుపులోకి తీసుకుని అతని వద్ద నుంచి 1.7 కిలోల ఎండు గంజాయి స్వాధీనం చేసుకుంది. ఈ అక్రమ వ్యాపారంలో సహకరిస్తున్న బీహార్కు చెందిన సుశీల్ కుమార్, ప్రేమ్ రామ్లను కూడా అధికారులు అరెస్టు చేశారు. అనంతరం ముగ్గురిని షాద్ నగర్ ఎక్సైజ్ స్టేషన్కు అప్పగించగా, కోర్టు ఆదేశాల మేరకు 25 ఫిబ్రవరి న రిమాండ్కు తరలించారు. ఈ దాడుల్లో ఎన్ఫోర్స్మెంట్ సీఐ ఎ. బాలరాజు, ఎస్త్స్ర కె. వెంకటేశ్వర్లు మరియు సిబ్బంది పాల్గొన్నారు.